తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఎవరు? అంటే... పూజా హెగ్డే (Pooja Hegde), రష్మికా మందన్నా పేర్లు తప్పకుండా ముందు వరుసలో ఉంటాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఇద్దరూ సినిమాలు చేశారు. హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. అఫ్‌కోర్స్... రష్మిక కంటే పూజా హెగ్డే చేతిలో క్రేజీ హిందీ సినిమాలు ఉన్నాయి. సినిమాల విషయంలో వాళ్ళిద్దరూ పోటీ పడుతున్నారో? లేదో? గానీ... వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉందని ఇండస్ట్రీ అనుకుంటుంది. అది పక్కన పెడితే... పూజా హెగ్డే చేయాల్సిన భారీ సినిమా ఒకటి రష్మిక చేతికి వెళ్ళింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆ హీరోతో పూజా హెగ్డే లేటెస్టుగా సినిమా చేయడమే!
తమిళ స్టార్ హీరో విజయ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ బైలింగ్వల్ సినిమా (Thalapathy 66) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. నిజం చెప్పాలంటే... హీరో విజయ్, ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫస్ట్ ఛాయస్ ఆమె కాదు. పూజా హెగ్డే. విజయ్ దగ్గర హీరోయిన్ ఎవరైతే బావుంటుందనే డిస్కషన్ వచ్చినప్పుడు దర్శక - నిర్మాతలు పూజా హెగ్డే పేరు సూచించారట.
ఏప్రిల్ 13 (ఈ శుక్రవారం) న విడుదలవుతున్న విజయ్ 'బీస్ట్'లో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఆల్రెడీ ఆమెతో సినిమా చేయడం వల్ల... రిపీట్ చేస్తే ఎలా ఉంటుందోనని రష్మిక దగ్గరకు వెళ్లారట. 'బీస్ట్' విడుదల సందర్భంగా తెలుగులో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, పూజా హెగ్డేతో చేసిన ఇంటర్వ్యూలో 'దిల్' రాజు చెప్పారు. ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకున్నామని, డేట్స్ ఇష్యూ అని పూజా హెగ్డే చెప్పారు.
Also Read: మా అక్కా? నేనా? బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్
Thalapathy Vijay Appreciates Pooja Hegde Professionalism: "ఆల్రెడీ పూజా హెగ్డేతో రెండు సినిమాలు చేశా. తన ప్రొఫెషనలిజం గురించి తెలుసు. విజయ్ కూడా 'పూజా హెగ్డే చాలా ప్రొఫెషనల్' అని చెప్పారు. ఒక హీరో నుంచి అటువంటి కాంప్లిమెంట్ రావడం సూపర్" అని 'దిల్' రాజు చెప్పారు.