Rajasekhar Daughters On Fire: శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మరికొంత మంది దుబాయ్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను ఈ ముగ్గురూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. స్నేహితులతో కలిసి రాజశేఖర్ కుమార్తెలు సరదాగా షికారుకు వెళ్లారని కొందరు భావించారు. అయితే... కొంత మంది ఓ అడుగు ముందుకు వేసి కొత్త ప్రచారం ప్రారంభించారట.
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాజశేఖర్ కుమార్తె లేచిపోయిందని (Rajasekhar Daughter Ran Away With Boyfriend?) సోషల్ మీడియాలో, ఓ సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియా కొత్త వార్త వండి వార్చింది. ఆ నోటా, ఈ నోటా ఆ పుకారు రాజశేఖర్ ఫ్యామిలీకి చేరింది. దాంతో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఫైర్ అయ్యారు. తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లినట్టు ఆమె తెలిపారు. దుబాయ్‌లో దిగిన ఫ్యామిలీ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు శివాత్మిక.
Also Read: టాలీవుడ్లో విషాదం, సీనియర్ నటుడు బాలయ్య మృతి
"వీళ్ళ (రాజశేఖర్, జీవిత, శివాని)తో కలిసి దుబాయ్ వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి... ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు? నేను లేదా శివాని లేచిపోయింది ఎవరితో? నాన్ సెన్స్ రూమర్స్! నెక్స్ట్ లెవల్ న్యూస్ ఇది! రూమర్స్ రాసేటప్పుడు క్లారిటీగా ఉండండి. లేచిపోయింది ఎవరు? నేనా? శివానీనా? బీ క్లియర్" అని ఘాటుగా శివాత్మిక పోస్ట్ చేశారు.
Also Read: చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో పూరి జగన్నాథ్, సెట్స్‌లో పూరికి మెగా వెల్కమ్
దుబాయ్ లో శివాత్మిక ఫొటోలు: