ఆస్కార్ వేడుకల్లో నటుడు క్రిస్ రాక్ మీద విల్ స్మిత్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. వీక్షకులకు వినోదం పంచే క్రమంలో క్రిస్ రాక్ తన భార్య పేరు తీసుకు రావడాన్ని విల్ స్మిత్ సహించలేకపోయారు. నేరుగా వేదికపైకి పెళ్లి చెంపదెబ్బ కొట్టారు.
విల్ స్మిత్ చర్యలపై సమావేశమైన ఆస్కార్స్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్... స్టార్ హీరో పదేళ్ల పాటు ఆస్కార్ పురస్కార వేడుకలు సహా అకాడమీ నిర్వహించే ఏ కార్యక్రమాలకూ హాజరు కాకూడదని నిషేధం విధించింది. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు విల్ స్మిత్ పేర్కొన్నారు.
నిషేధంలో ఓ నిజం ఏంటంటే... ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.
చెంపదెబ్బ తర్వాత అతడికి ఇచ్చిన పురస్కారాన్ని ఆస్కార్స్ వెనక్కి తీసుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే... అటువంటి నిర్ణయం ఏదీ అకాడమీ బోర్డ్ తీసుకోలేదు. నిషేధం విధించినా... పదేళ్లు ఉత్తమ నటుడు విభాగంలో విల్ స్మిత్ నామినేషన్, విన్నింగ్ అవకాశాలను సజీవంగా ఉంచింది.
Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?
విల్ స్మిత్ సినిమాలు, విల్ స్మిత్ ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యే అవకాశాలపై ఎటువంటి నిషేధం లేదు. కాకపోతే అతడు ఆస్కార్స్ ఈవెంట్స్‌కు అటెండ్ కాలేదు. నిషేధం కారణంగా వచ్చే ఏడాది ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందించే అవకాశాన్ని విల్ స్మిత్ కోల్పోయాడు. గత ఏడాది విజేత ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నిలిచిన వ్యక్తికి పురస్కారం ఇవ్వడం ఆస్కార్స్ ఆనవాయితీ. ఆల్రెడీ ఆస్కార్ సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రవర్తన పట్ల క్షమాపణలు కూడా కోరారు.
Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: 'చీకటి గదిలో చితకొట్టుడు'తో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?