బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహూజాకు దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ బంగ్లా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆభరణాలు - డబ్బు... మొత్తం మీద సుమారు కోటిన్నర విలువ చేసే సొత్తు మాయం అయ్యింది. ఈ విషయమై న్యూఢిల్లీలోని తుగ్లగ్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో సోనమ్ కపూర్ అత్త, ఆనంద్ తల్లి ప్రియా ఆహూజా ఫిర్యాదు చేశారు.


డ్రైవర్లు, కేర్ టేకర్లు, గార్డెనింగ్ పని చేసేవారు, వంట మనుషులు... మొత్తం ఆహూజా ఇంట్లో మొత్తం పాతిక మంది పని మనుషులు ఉన్నారు. దొంగతనం జరిగిన నేపథ్యంలో వాళ్ళను పోలీసులు విచారిస్తున్నారు. ఫిబ్రవరిలో చోరీ జరిగిందని తెలిసింది. ఫిబ్రవరి 11న ఆహూజా ఫ్యామిలీకి దొంగతనం జరిగినట్టు అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికినా ఎక్కడా నగలు కనిపించకపోవడంతో ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేశారు. అయితే... కాస్త ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


Also Read: మా అక్కా? నేనా? బాయ్‌ ఫ్రెండ్‌ తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్


చోరీ జరిగిన సమయంలో సోనమ్ - ఆనంద్ దంపతులు ఇంట్లో లేరు. సోనమ్ గర్భవతి కావడంతో కొన్ని రోజులుగా ఆమె ముంబైలో ఉంటున్నారు. భర్త కూడా ఆమెతో ఉంటున్నట్టు సమాచారం. కప్ బోర్డ్స్ లో నగలు మాయం అయ్యాయని ఆనంద్ గ్రాండ్ మదర్ సరళ ఆహూజా  గమనించడంతో ఫిర్యాదు చేశారు. 


Also Read: చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో పూరి జగన్నాథ్, సెట్స్‌లో పూరికి మెగా వెల్కమ్