టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బండ్ల గణేష్. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకొచ్చిన బండ్ల గణేష్ 'మా' ప్రధాన కార్యదర్శి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కాసేపటి క్రితం ఆయన దాఖలు చేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.


Also Read:ఆ రోజు నాకు వైద్యం చేసింది అల్లు రామలింగయ్యే.. రాజమండ్రిలో చిరు చిట్‌చాట్


మొన్నామధ్య ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జీవితం చేరడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బండ్ల గణేష్ బహిరంగంగానే తన మనోభావాలను వెల్లడించారు. జీవితను ఓడించడానికి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం కూడా బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా వెనుక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు.. నా గెలుపు ఖాయం' అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. 


అంతేకాదు ట్విట్టర్ లో విభిన్న ప్రచారం చేశారు. 'మా' కోసం ఒక్క ఓటు అంటూ హడావిడి చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కానీ, మంచు విష్ణు ప్యానెల్ కానీ ప్రెస్ మీట్స్ పెడితే.. వెంటనే తన ట్విట్టర్ అకౌంట్ లో 'ఓటు మాత్రం నాకే వేయండి' అంటూ బండ్ల గణేష్ రచ్చ చేశారు. ఇంతలోనే నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.


''నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను'' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. బండ్ల గణేష్ తన నివాసంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లతో కలిసి ఆ ఫొటోలో దర్శనమిచ్చారు. 










Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?


Also Read: ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు


Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి