పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హీరో మంచు విష్ణు స్పందించారు. మంగళవారం ఆయన తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఊరేగింపుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు దివంగత దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మీడియాతో మాట్లాడారు.
‘‘పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఆయన మా గురించి చేసిన వ్యాఖ్యలపై నాన్న మోహన్‌బాబే స్పందిస్తారు. 10న ఎన్నికలు పూర్తికాగానే.. 11న విలేకరుల సమావేశం పెట్టి మరీ మాట్లాడతారు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దని నేను ముందే చెప్పా. కానీ, ఏ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ‘మా’ ఎన్నికల్లో మా ప్యానల్ తప్పకుండా గెలుస్తుంది. 900 మంది నాకు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి మా ప్యానెల్ మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. మా మ్యానిఫెస్టో చూశాక చిరంజీవి, పవన్ కూడా మాకే ఓటు వేస్తారు’’ అని విష్ణు తెలిపారు.
Also Read: పేద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. బండ్ల గణేష్ ‘మా’ హామీ!
ప్రకాష్ రాజ్ ఏ వైపు?: ‘‘నిర్మాతలు లేనిదే ఇండస్ట్రీ కూడా లేదు. ‘మా’ ఎన్నికలు ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటం. నేను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉన్నాను. ప్రకాష్ రాజ్ ఏవైపు ఉన్నారో చెప్పాలి. సినీ పరిశ్రమ వైపా లేదా పవన్ కళ్యాణ్ పక్షమా అనేది ప్రకాష్ రాజ్ చెప్పాలి’’ అని విష్ణు డిమాండ్ చేశారు.
Also Read: పవన్ ‘మా’ సభ్యుడే.. ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు: ప్రకాష్ రాజ్
మంగళవారం నామినేషన్లు దాఖలు చేసిన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు వీరే:
మంచు విష్ణు - అధ్యక్షుడు
రఘుబాబు - జనరల్ సెక్రటరీ
బాబు మోహన్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
మాదాల రవి - వైస్ ప్రెసిడెంట్
పృథ్వీరాజ్ బాలిరెడ్డి - వైస్ ప్రెసిడెంట్
శివబాలాజీ - ట్రెజరర్
కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి