మూవీ ఆర్టిస్ట్స్  అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈసారి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ నేరుగా పోటీకి దిగడం చర్చకు దారితీసింది. ప్రకాశ్ రాజ్ బరిలో దిగినప్పటి నుంచీ లోకల్, నాన్ లోకల్ అంశంపై భారీ చర్చే జరిగింది. అయితే నటుడికి లోకల్,నాన్ లోకల్ అనే తేడా ఏముందని చాలామంది రియాక్టయ్యారు. తాజాగా ప్రొడ్యూస్ బండ్ల గణేశ్ కూడా మరోసారి అదే మాట అన్నాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తే తప్పేంటి? అని బండ్ల  ప్రశ్నించాడు. ప్రకాశ్‌రాజ్‌ని నాన్‌లోకల్‌ అనడం పట్ల గణేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎలా నాన్ లోకల్ అవుతారని ప్రశ్నించాడు. అయినా సినిమాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తీసుకొచ్చుకుంటే తప్పులేదు కానీ ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో పోటీచేస్తే ఏమైందన్నాడు.


ప్రకాష్ రాజ్ తో 23ఏళ్లుగా పరిచయం ఉందని గతంలోనే చెప్పిన బండ్ల...తనకు ఆయన ఎప్పటి నుంచో ఆప్తుడన్నాడు. హైదరాబాద్ పక్కన భూములు కొని, ఫామ్ హౌస్ కట్టి వందలమందికి సహాయం చేస్తున్నాడని.. ముఖ్యంగా కరోనా సమయంలో సొంత డబ్బులతో ఎందరికో వైద్యం, భోజనం అందించాడని చెప్పుకొచ్చాడు. ఎంతోమంది పేద కళాకారుల పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు లక్షల్లో దానాలు చేసిన విషయం గుర్తు చేశాడు.’ మా’ సభ్యులందరూ ఒకటే, కులమత వర్గ భేదాలు లేవు..లోకల్-నాన్ లోకల్ అనే ఫీలింగ్స్ అస్సలే లేవన్న బండ్ల..ఇక్కడ పుట్టిన ప్రభాస్ దేశాన్ని ఏలుతున్నాడన్నాడు. రాజమౌళితో హాలీవుడ్ వాళ్ళు సినిమా చేయాలనుకుంటున్నారు..సో..ప్రతిభ, సమర్ధత ఉండాలి.. లోకల్ నాన్ లోకల్ అనే తారతమ్యాలు ఉండవని బండ్ల గణేష్ గతంలోనూ ఓసారి అన్నాడు. గతంలో మా అధ్యక్షులుగా చేసినవారు బాగా చేశారు. వాళ్ళకంటే మెరుగ్గా ప్రకాష్ రాజ్ చేయగలరని భావించి సప్పోర్ట్ చేస్తున్నా అన్నాడు బండ్ల గణేష్. తమ వెనుక పెద్దపెద్దోళ్లు ఉన్నరాన్న బండ్ల... విజయం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ దే అన్నాడు. ఇక బండ్ల లాస్ట్ పంచ్ ఏంటంటే…ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ అధ్యక్షుడైతే టాలీవుడ్‌కే గర్వకారణం అన్నాడు.


Also Read:నరేశ్‌ పార్టీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు.. మందుకొడతారు, కలసి భోజనం చేస్తారు తప్పేముందంటూ కామెంట్‌


మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికలకు పోటీ హోరాహోరీగా ఉండనుంది. నిన్నటివరకూ విడివిడిగా పోటీ చేస్తున్నారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ.. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి అడుగుపెట్టారు. దీంతో, ఈసారి ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌, మంచువిష్ణు ప్రధాన పోటీదారులుగా మారారు. ఎవరికి వారే గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తున్నారు.


Also Read: జయలలిత సమాధిని సందర్శించిన రీల్ ‘తలైవి’ కంగనా


Also Read: సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు


Also Read: సరదా తీరిపోతోంది..ఇంక నావల్లకాదంటున్న హీరో కార్తికేయ , అలరిస్తోన్న ''రాజా విక్రమార్క'' టీజర్