'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తరువాత 'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. 'గీతగోవిందం' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. దీంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. తొలిసారి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అది కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కావడం విశేషం.
'లైగర్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైంది. కానీ కరోనా కారణంగా బాగా ఆలస్యమైంది. ఆగస్టు 25, 2022న సినిమాను విడుదల చేయనున్నట్టు రీసెంట్ గా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ నెల 31న ఇయర్ ఎండ్ సందర్భంగా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. రేపు ఉదయం 10:03 నిమిషాలకు బిగ్ అనౌన్స్మెంట్ వీడియో రాబోతుందని చెప్పారు. అలానే డిసెంబర్ 30న బీటీఎస్ స్టిల్స్, స్పెషల్ ఇన్స్టా ఫిల్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అంటే వరుసగా.. మూడు రోజులు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు పండగే. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: 'ఇందువదన' ట్రైలర్.. ఇదొక హారర్ లవ్ స్టోరీ..
Also Read:2021 హయ్యెస్ట్ గ్రాసర్ 'పుష్ప'.. 'ఆర్ఆర్ఆర్' గనుక రాకపోతే.. నిర్మాత వ్యాఖ్యలు
Also Read: మెగాహీరోపై ఛార్జ్‌షీట్.. తేజ్ ని వదలని యాక్సిడెంట్ కేసు..
Also Read:సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. ఫోన్లు పగలగొట్టండి అంటూ మంగ్లీ ఫైర్..
Also Read: హ్యాట్రిక్ హిట్స్ తో బాక్సాఫీస్ రచ్చ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి