డ్రగ్స్ కేసుకి సంబంధించి ఈరోజు కెల్విన్, కుదూస్ లను ఈడీ అధికారులు ఏడు గంటలుగా విచారిస్తున్నారు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. అంతేకాదు.. సినీ తారల బ్యాన్ అకౌంట్స్ నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ ల అకౌంట్స్ మధ్య లావాదేవీలు జరిగినట్లు కూడా తేలింది. ఈరోజు కెల్విన్ తో పాటు ఖుధూస్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. 


Also Read : Tollywood Drug Case: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?


ఇదిలా ఉండగా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన నందుతో పాటు మిగిలిన ఎనిమిది మంది నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది ఈడీ. దీనికోసం కీలక సూత్రధారిని తమ అదుపులోకి తీసుకుంది. అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన నందుని ఐదు గంటలుగా విచారిస్తూనే మధ్యలో కెల్విన్ ను ఈడీ ఆఫీస్ కు రప్పించి అరెస్ట్ చేశారు. 


Also Read : Watch: డ్రగ్స్ కేసులో విచారణకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్


అంతకముందు నందు బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. అనుమానాస్పద లావాదేవీలపై ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. ఇక ఈ ఎపిసోడ్ లో హీరో రానాను విచారించే 24 గంటలా ముందే.. కెల్విన్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు ఈడీ అధికారులు. దానికి అనుగుణంగానే రానాని ప్రశ్నించే అవకాశం ఉంది. ఈడీ వీళ్లందరినీ విచారించడానికి ఉన్న ఆధారం కెల్విన్ కాల్ డేటా.. అతని బ్యాంక్ స్టేట్మెంట్స్. అతనితో ట్రాన్జాక్షన్స్‌ నిర్వహించిన సినీ ప్రముఖులందరి డేటానూ పరిశీలిస్తోంది ఈడీ. 


Also Read : Tollywood Drugs Case: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!


Also Read : Bigg Boss 5 Telugu : ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..


Also Read : Bigg Boss Telugu 5 : బట్టలు లాకెళ్లిన బిగ్ బాస్.. అమ్మాయి డ్రెస్ లో రవి అరాచకం..


Also Read : Pan India Movies : దిల్ రాజు ప్లానింగ్.. నెక్స్ట్ రెండు నెలల్లో రచ్చ రచ్చే..