టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు వేరే భాషల్లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు.. భారీ పాన్ ఇండియా సబ్జెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నన్ని పాన్ ఇండియా కథలో టాలీవుడ్ లో మరే నిర్మాత చేతుల్లో లేవు. అవి కూడా క్రేజీ కాంబినేషన్స్ కావడం విశేషం. ఇప్పుడు తను తెరకెక్కించబోయే మొత్తం మూడు పాన్ ఇండియా సినిమాలను నెక్స్ట్ రెండు నెలల్లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు దిల్ రాజు.
రామ్ చరణ్ - శంకర్ :
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశారు దిల్ రాజు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తోన్న రామ్ చరణ్ తన కొత్త సినిమాకి కాల్షీట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సెప్టెంబర్ 8 అంటే రేపే ఈ సినిమాను ప్రారంభించనున్నారు. దీనికోసం కియారా అద్వానీ ముంబై నుండి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ సినిమా పూజా వేడుకకు ఎవరిని గెస్ట్ గా పిలుస్తారో చూడాలి.
విజయ్ - వంశీ పైడిపల్లి :
రామ్ చరణ్ సినిమాతో పాటు మరో పాన్ ఇండియా సినిమాను లాంచ్ చేయబోతున్నారు దిల్ రాజు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా ఓ సినిమాను సెట్ చేశారు దిల్ రాజు. తొలిసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. దసరా రోజు ఫార్మల్ గా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఐకాన్ :
అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది. ఇప్పుడు అక్టోబర్ లో ఈ సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నప్పటికీ.. సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Also read: మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటా అన్న సరయు..నచ్చలేదు డార్లింగ్ అన్న సన్నీ..మొదటి వారం నామినేషన్లలో రచ్చ