పిల్లలు ‘‘మ్యావ్.. మ్యావ్’’ అని అంటాయి. కానీ, అమ్మా అని పిలుస్తాయా? కానీ.. హమీదా ఇంట్లోని పెంపుడు పిల్లి అలాగే పిలుస్తుందట. చిత్రంగా ఉంది కదూ. సూపర్ మోడల్ జెస్పీకి కూడా అదే అనిపించింది. దీంతో ఆమెకు కౌంటర్ కూడా ఇచ్చాడు. దాని వల్ల బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది. ఇది నామినేషన్లకు కూడా దారి తీసింది. చివరికి.. ఈ పిల్లి గోల జెస్సీ, హమీదాలను కన్నీళ్లు పెట్టుకొనేలా చేసింది. ఇంతకీ ఏమైంది? ఆ పిల్లి ప్రస్తావన గొడవకు ఎందుకు దారి తీసిందో మీకు తెలుసుకోవాలని ఉందా?


బిగ్ బాస్ 2వ ఎపిసోడ్ చూసినవారికి.. నామినేషన్లలో వారు ఎందుకలా తిట్టుకుంటున్నారో సరిగా అర్థమై ఉండదు. ముఖ్యంగా జెస్సీ-హమీద మధ్య జరిగిన గొడవ నామినేషన్ల ప్రక్రియను గందరగోళంగా మార్చింది. సోమవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో జెస్సీ, శ్వేతా వర్మలతో కలిసి హమీదా గార్డెన్ ఏరియాలో కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తాను పెంచుకుంటున్న పిల్లి గురించి చెప్పింది. ఆ పిల్లి ‘మ్యావ్’ అనదని, ‘మా..’ అంటుందని చెప్పడంతో కాసేపు జెస్సీకి నోట మాటరాలేదు. ఆ షాక్ నుంచి తేరుకొనే లోపు.. తన వద్ద కుక్క కూడా ఉందని హమీదా చెప్పడంతో.. వెంటనే జెస్సీ కౌంటర్ వేశాడు. అవి డాడీ అని పిలుస్తాయా అని వ్యంగ్యంగా అన్నాడు. 


Also Read: బిగ్ బాస్‌ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ


అప్పుడు ఆ విషయాన్ని సరదాగానే తీసుకున్నా హమీదా ఆ తర్వాత అవమానంగా ఫీలైంది. మిగతా హౌస్‌మేట్స్‌కు ఈ విషయాన్ని చెబుతూ సీన్ క్రియేట్ చేసింది. దీంతో జెస్సీ ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని కారణంగా చూపిస్తూ యాని మాస్టర్, విశ్వ అతడిని నామినేట్ చేశారు. నామినేషన్ల సమయంలో అంతా తనని టార్గెట్ చేసుకున్నారనే కారణంతో జెస్పీ కంటతడి పెట్టుకున్నాడు. ఇది అతడి మీద సింపథీ క్రియేట్ చేసింది. దీంతో అతడు బయటకు వెళ్తాడా లేదా అనేది అనుమానమే. అయితే, ఈ వారం సభ్యుల ప్రవర్తనపైనే ఎలిమినేషన్ ఆధారపడి ఉంటుంది. ఈ వారాంతంలో అంచనాలు తారుమారు అవుతాయి. ప్రస్తుతం నామినేషన్లలో యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ ఉన్నారు. ఒక వేళ జెస్సీ ఈ వారం నామినేట్ అయితే.. బిగ్ బాస్ చరిత్రలో పిల్లి వల్ల నామినేట్ అయిన ఏకైక హౌస్‌మేట్‌గా జెస్సీ నిలిచిపోతాడు.