మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మళ్ల విజయప్రసాద్‌పై ఒడిశాలో కేసు నమోదైంది. ఈ  కేసు విచారణలో భాగంగా మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా సీఐడీ, నేరవిభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్ల విజయప్రసాద్‌ను విశాఖ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ అనుమతితో విజయప్రసాద్‌ను ఒడిశా తీసుకెళ్లారు.  కాగా ఆయన ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. 


Also Read: Weather Alert:  తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు.. మరో రెండు రోజులు కూడా.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్


Also Read: మీరు ఇన్ స్టాలో ఉన్నారా? అయితే న్యూడ్ కాల్స్ రావొచ్చు.. తర్వాత పోర్న్ వీడియోల్లో మీ ఫేస్ ఉండొచ్చు


ఒడిశాలో చిట్ ఫండ్ సంస్థ


మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మళ్ల విజయప్రసాద్ అరెస్ట్ అయ్యారు. చిట్‌ఫండ్‌ కేసులో ఆయన్ని ఒడిశా సీఐడీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వెల్ఫేర్‌ సంస్థ పేరుతో మళ్ల విజయ ప్రసాద్ రియల్‌ ఎస్టేట్‌, చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో వీటి బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఒడిశాలోనూ చిట్‌ఫండ్‌ వ్యాపారం నిర్వహించారు. అక్కడ డిపాజిట్‌దారులకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Also read: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..


రెండేళ్ల క్రితమే కేసు


ఈ ఫిర్యాదులపై ఒడిశా సీఐడీ పోలీసులు రెండేళ్ల కిందటే కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సీఐడీ పోలీసులు సోమవారం విశాఖ వచ్చారు. మళ్ల విజయ ప్రసాద్‌ను స్థానిక అధికారుల అనుమతితో ఒడిశా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


 


Also Read: అక్రమ ఇసుక రవాణా వివాదంలో ఏపీ మంత్రి... ఎస్సైతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్...!


Also Read: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు... ఏపీ హైకోర్టు కీలక తీర్పు... ఈ ఏడాదికి పాత విధానమే...


Also Read: నూటొక్క జిల్లాల మాయగాడు.. విగ్గుతో యువతులకు గాలం... అబ్బో ఇంకా చాలా సిత్రాలు ఉన్నాయ్