సాంకేతిక పెరిగింది సైబర్ దాడులు కూడా పెరిగాయి. సైబర్ అటాక్ అనేది ఇలా.. అలా అని ఏమీ ఉండదు. సైబర్ దాడి చేసే వ్యక్తి ఎలా పడితే అలా మీ మీద తెలియని దాడి చేసి.. మీ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు లాక్కొవచ్చు. తాజాగా ఇన్ స్టాలో ఫిషింగ్ క్రైమ్ ఎక్కువగా పెరిగిపోయింది.  ఇన్ స్టాలో మీకు కాల్ చేస్తారు. పొరపాటున మీ ఫేస్ వాళ్ల ఫోన్ లో రికార్డు అయితే అంతే సంగతులు.. రకరకలుగా మీ ఫేస్ ని వాడేస్తారు. పోర్న్ వీడియోలో మీ ఫేస్ ని సెట్ చేసి మీ దగ్గర డబ్బులు లాగే స్కెచ్ వేస్తారు. 


హర్యానా, యూపి, రాజస్థాన్‌ల నుంచి ఈ దాడులకు ఎక్కువగా పాల్పడుతున్నారు. భరత్‌పూర్, మథుర, మేవాట్ వంటి ప్రాంతలను కేంద్రంగా చేసుకుని సైబర్ దాడులు చేస్తున్నారు. అయితే వాళ్లు ఏ నెంబర్ నుంచి.. సైబర్ క్రైమ్ చేస్తారని.. తెలియదుగాని.. ఈ ప్రాంతాల్లో ఫ్రీక్వెన్నీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ఫిషింగ్ క్రైమ్ లో మోసపోయాడు. అయితే అతడు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది.


భాసిన్ అనే వ్యక్తికి ఇన్ స్టాలో ఒక మహిళ నుంచి నేరుగా మెసేజ్ వచ్చింది. ఆమె అతడి వాట్సాప్ నెంబర్ అడగింది. అయితే భాసిన్ దానిని పట్టించుకోలేదు. కొన్ని నిమిషాల్లోనే ఆమె ఇన్ స్టాలో వీడియో కాల్స్ చేయడం మెుదలుపెట్టింది. మెుదట్లో ఆ కాల్స్ ని పట్టించుకోని భాసిన్.. కొన్ని రోజుల తర్వాత సమాధానం ఇచ్చాడు. 


కాల్స్ చేసిన మహిళ నగ్నంగా.. అసభ్యకరమైన పనులు చేస్తోంది.  ఏం జరుగుతుందో అర్థంకాక భాసిన్ వీడియో కాల్ కట్ చేశాడు. అయితే ఈ సమయంలో కాల్ చేసిన అవతలి వారు బాసిన్ ఫేస్ ని క్యాప్చర్ చేశారు. వేరొకరి శరీరంపై భాసిన్ మెుఖన్ని పెట్టి.. వీడియోలు షేర్ చేయడం మెుదలు పెట్టారు. అయితే న్యూడ్ గా భాసిన్ సెక్స్ చాట్ చేస్తున్నట్లు కూడా క్రియేట్ చేశారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు బాధితుడు చెప్పాడు. 


ఆగ్రా సైబర్ పోలీసులు మేవాట్ లో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, వాళ్లు 'బ్లాక్ మెయిల్ చేయడానికి న్యూడ్ వీడియో కాల్స్' చేయడం సహా వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. అయితే బాసిన్ ను టార్గెట్ చేసింది ఇదే ముఠా అని పోలీసులు భావిస్తున్నారు.


ఫిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి, URL లేదా ఇమెయిల్ అటాచ్‌మెంట్‌పై క్లిక్ చేయడం వంటి వాటితో ఇందులో మోసపోతారు. వినియోగదారుల లాగిన్ ఆధారాలను దొంగిలించడానికి ఫిషింగ్ దాడులు చేస్తారు సైబర్ నేరగాళ్లు. బాధితుల ఇమెయిల్‌లు లేదా బ్యాంక్ ఖాతాలను తెలుసుకునేందుకు ఇలాంటి క్రైమ్ చేస్తారు. అంతేగాకుండా.. కాల్స్ చేసి బెదిరింపులులాంటివి కూడా చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు.


Also Read: Chittoor News: నూటొక్క జిల్లాల మాయగాడు.. విగ్గుతో యువతులకు గాలం... అబ్బో ఇంకా చాలా సిత్రాలు ఉన్నాయ్