చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఒక్కరోజు కాఫీ సేవనం మిస్సయినా కూడా ఆ రోజంతా వెలితిగా ఫీలవుతుంటారు. కాఫీ తాగగానే చాలా ఎనర్జిటిక్ గా మారిపోతారు. అయితే కాఫీ తాగితే మంచిదేనా? కాఫీలో ఉండే కెఫీన్ హాని చేయదా? లాంటి సందేహాలు ఇప్పటికే వినిపిస్తూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు చెప్పినదాని ప్రకారం కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్లు కింద చెప్పిన మూడు తప్పులు చేయకుండా ఉంటే కాఫీని హాయిగా సేవించవచ్చు. అంతేకాదు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చేయకూడదని ఆ మూడు పనులు ఏంటంటే...


1. అతిగా తాగొద్దు


కొంతమంది ప్రతి రెండుగంటలకోసారి కాఫీ తాగేస్తుంటారు. వేళాపాళా కూడా ఉండదు. ఇలా చేస్తే కాఫీ చేసే మేలు కన్నా కీడే ఎక్కువ. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు కేవలం రెండు సార్లు మాత్రమే కాఫీ తాగాలి. ఈ మొత్తంలో శరీరంలోకి చేరే కెఫీన్ హాని చేయదు. రెండు కప్పులకు మించి తాగే వారికి మాత్రమే ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది. కడుపునొప్పి, మూర్ఛ,  హృదయ స్పందనలో తేడాలు రావడం వంటి సమస్యలు రావొచ్చు. ఇలా దీర్ఘకాలం పాటూ అధిక మొత్తంలో కెఫీన్ శరీరంలో చేరితో నిద్రలేమి, మానసిక ఆందోళన కూడా కలుగవచ్చు. 


2. పంచదారకు బదులు...


మనకు మార్కట్లో దొరికే రిఫైన్ట్ షుగర్ లో కేవలం కెలరీలో మాత్రమే లభిస్తాయి, ఎలాంటి పోషకాలు ఉండవు. కెఫీన్ కు అధిక కెలరీల పంచదారని జత చేర్చి తాగితే ఆరోగ్యానికి మరింత హాని కలిగే అవకాశం ఉంది. ఊబకాయం, మధుమేహం సమస్యలను మరింతగా పెంచుతుంది. కనుక కాఫీలో చాలా తక్కువ మోతాదులో చక్కెలో వేసుకోండి. వీలైతే బెల్లం వంటి ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. దాల్చిన చెక్క పొడిని చేర్చడం ద్వారా కూడా కాఫీకి కాస్త తీపిని జోడించవచ్చు. 


3. ఆ టైమ్ దాటాక వద్దు


కాఫీ తాగేందుకు కూడా సరియైన సమయాన్ని నిర్ణయించుకోండి. చాలా మంది మూడు పూటలా కాఫీ తాగే అలవాటు ఉంది. సాయంత్రం పూట మాత్రం కచ్చితంగా తాగేవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. కానీ మధ్యాహ్నం రెండు గంటల తరువాత కాఫీ జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు వైద్యులు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం తరువాత తాగే కాఫీ మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తుంది. ఇలా రోజు అర్థరాత్రి వరకు నిద్రలేకుంటే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. మెదడు పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. ఒకవేళ ఆ సమయానికి తాగాలనిపిస్తే డికాఫ్ (డికాఫీనేటెడ్ కాపీ) అంటే కెఫీన్ లేని కాఫీని తాగండి. ఇది మార్కెట్లో లభిస్తోంది. 


Also read: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..


Also read: ఈ బెండకాయ కిలో రూ.800... తింటే ఎంత ఆరోగ్యమో