Horoscope Today :ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం…వారు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

Continues below advertisement

2021 సెప్టెంబర్ 7 మంగళవారం రాశిఫలాలు

మేషం

మేషరాశివారు ఈ రోజు శుభవార్త వింటారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉండొచ్చు. వృత్తిపరమైన ఆందోళనలు తొలగిపోతాయి. రిస్క్ తీసుకోవద్దు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.

Continues below advertisement

వృషభం

మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబానికి సంబంధించిన అన్నిఅవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.

మిథునం

అధిక వ్యయం కారణంగా నెలవారీ బడ్జెట్లో మార్పులుంటాయి. టెన్షన్ ఉంటుంది కానీ అధిగమించేందుకు ప్రయత్నించండి. ప్రతికూల పరిస్థితి తలెత్తినా కుటుంబ సభ్యుల మద్దతుతో మీ ఆందోళనలు తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Also read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

కర్కాటక రాశి

ఈరోజు మాట మీద సంయమనం ఉండాలి. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రిస్క్ తీసుకోకండి. ఖర్చు చేసే ముందు ఆలోచించండి.

సింహం

ఈరోజు పూర్తి సానుకూలత ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇదే మంచిరోజు. భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దినచర్యలో మార్పు ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు. సమయానికి బాధ్యతను నిర్వర్తించగలరు.

కన్య

ఎదురైన ఇబ్బందులను అధిగమించగలరు. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రశాంతంగా ఉండండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ప్రతి సమస్యా పరిష్కారమవుతుంది. ప్రస్తుతానికి పెట్టుబడులు వాయిదా వేయండి.

Also Read:మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...

తులారాశి

కొత్త ప్రదేశానికి వెళతారు. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారం బాగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. ఎముకలకు సంబంధించిన సమస్యలు రావొచ్చు.  వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేసే పనికి మీరే బాధ్యత వహించండి.  ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.

వృశ్చికరాశి

అన్నింటా విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందడం ద్వారా మీ ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. టెన్షన్ పోతుంది. ఉద్యోగం మారాలి అనుకునే వారు కొంతకాలం ఆగిచూడాలి.

ధనుస్సు

ధనస్సు రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం. విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అపరిచితులను నమ్మకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

Also Read:ఈ ఏడుగురికి మరణం లేదు....ఎవరు-ఎందుకు?

మకరం

ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. ఆరోగ్యం బాగుంటుంది. రిస్క్ తీసుకోకండి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చాలా పనులు పూర్తవుతాయి.

కుంభం

చేపట్టిన బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. పెట్టుబడులు పెట్టొచ్చు. వ్యాపారస్తులకు  మంచి రోజు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. పూర్వీకుల వ్యవహారాలు కొనసాగుతాయి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. రోజంతా సంతోషంగా ఉంటుంది.

మీనం

ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండొచ్చు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు భగవంతుడి ఆరాధనతో ప్రశాంతత పొందుతారు. టెన్షన్ ఉంటుంది.

Also Read: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!

Also read: డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య.. హీరో ఎవరో తెలుసా..!

Also read: ఏం గుర్తుపెట్టుకుంటాలేం అని ముఖ్యమైన సమాచారం మొత్తం మెయిల్, ఫోన్లలో భద్రపరుస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

 

 

 

 

 

 

 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola