‘బిగ్ బాస్ 5’ హౌస్‌లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సరయు.. మొదటి రోజే సన్నీతో కోల్డ్ వార్ మొదలు పెట్టింది. సన్నీని ‘రా’ అని సంబోధించడమే వీరి గొడవకు కారణం. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సన్నీ ఆమెను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘‘ఒకసారి తప్పు చేస్తా? మరోసారి కూడా తప్పు చేస్తా.. నేను మనిషిని’’ అని పేర్కొంది. ఇందుకు సన్నీ స్పందిస్తూ.. ‘‘మీరు ఏ మనిషో నాకు తెలియదు. ఒకసారి చెప్పినప్పుడు మరోసారి ఆ తప్పు చేయరు’’ అని పేర్కొన్నాడు. దీంతో సరయు ‘‘జ్ఞాని, దేవుడు’’ అంటూ అగ్నికి ఆజ్యం పోసింది. 


హౌస్‌లోకి ఎంటరైన తర్వాతి రోజు నుంచే సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. కాస్త పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుంటున్నట్లు వారి చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. లోబో ఇంట్లో ఎప్పుడు సరదాగా ఉంటాడో.. ఎప్పుడు సీరియస్ అవుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, లోబోకు సరయుతో దోస్తీ కుదిరింది. వీరిని స్మోకింగ్ జోన్ దగ్గర చేసిందని చెప్పుకోవాలి. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ బ్యూటీలు హమీద, సరయులు లోబోతో కలిసి దమ్ము కొట్టడం కనిపించింది. 


ఈ సందర్భంగా వారు హౌస్‌మేట్స్ గురించి మాట్లాడుకున్నారు. లోబోతో సరయు మాట్లాడుతూ.. ‘‘నీతో సరైన బాండింగ్ లేదు. బయట కనెక్ట్ అవుతాం. విశ్వ చాలా తొందరగా కనెక్ట్ అయ్యాడు’’ అని అంది. లోబో మాట్లాడుతూ.. ‘‘మీతో మజాక్ చేస్తున్నట్లు ఆ సీనియర్ నటి ప్రియాతో చేయలేను’’ అని అంటే.. హమీదా.. ‘‘ఆమె కలవదు కూడా..’’ అని పేర్కొంది. ‘బిగ్ బాస్’ అన్ సీన్‌లో దీన్ని టెలికాస్ట్ చేశారు. గత సీజన్లో స్మోకింగ్ జోన్‌ను ఎవరూ పెద్దగా వాడుకోలేదు. అంతకు ముందు సీజన్లలో తనీష్, ముమైత్ ఖాన్ తదితరులు ఎక్కువగా స్మోకింగ్ జోన్‌లోనే ఉండేవారు. ఈ సీజన్లో లోబో, సరయు, హమీదాలు ఈ జోన్‌ను వాడుకుంటున్నారు.  


సోమవారం జరిగిన మొదటి నామినేషన్లు వాడీవేడిగా సాగాయి. హౌస్‌మేట్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నామినేషన్లు చేశారు. కొందరు.. బాగా పాపులారిటీ ఉన్నవారిని టార్గెట్ చేసుకుంటూ తెలివిగా నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్లలో యాంకర్ రవి, సీరియల్ నటుడు మానస్,  సరయు, ఆర్జే కాజల్, హమీద, జెస్సీ ఉన్నారు. మరి, వీరిలో హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరో చూడాలి.


Also Read: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!


Also read: డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య.. హీరో ఎవరో తెలుసా..!


Also read: ఏం గుర్తుపెట్టుకుంటాలేం అని ముఖ్యమైన సమాచారం మొత్తం మెయిల్, ఫోన్లలో భద్రపరుస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!