దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి బడ్జెట్ రేంజ్‌లో రిలీజైన 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం ఇండియాలో లాంచ్ అయిన రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు అమెజాన్ డాట్ కామ్, షియోమీ ఔట్ లెట్లను సంప్రదించవచ్చు. రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ88 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోనుకు రీబ్రాండెడ్ వెర్షన్ గా రెడ్‌మీ 10 ప్రైమ్ ఎంట్రీ ఇచ్చింది.
రెడ్‌మీ 10 ప్రైమ్ ధర..
రెడ్‌మీ 10 ప్రైమ్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,499గా నిర్ణయించారు. ఈ ఫోను ఆస్ట్రాల్ వైట్, బైఫ్రాస్ట్ బ్లూ, ఫాంతమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్, ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోం స్టోర్స్, ఎంఐ స్టూడియోస్ సహా ఎంఐ రిటైల్ ఔట్ లెట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ మీద ప్రారంభ ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.750 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవారికి.. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల మీద 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లేని వారికి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల మీద 3 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎంఐ డాట్ కామ్ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.400 డిస్కౌంట్ వస్తుంది. మొబిక్విక్ (MobiKwik) ద్వారా కొనుక్కుంటే ఎంఐ ఎక్సేంజ్ ద్వారా రూ.10,500 ధరకే కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ 10 ప్రైమ్ స్పెసిఫికేషన్లు..
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే (1,080x2,400 పిక్సెల్స్) ఉంటుంది.
- ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
- ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- యాస్పెక్ట్ రేషియా 20:9గా, రీఫ్రెష్ రేటు 90Hzగా ఉంది.
- మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
- క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది.
- 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 9 వాట్స్ రివర్స్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది.
Also Read: Lenovo IdeaPad Slim 5 Pro: లెనోవో నుంచి ఐడియా ప్యాడ్ ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లు ఇవే..