విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుటుంబ చిత్రాలతోనే కాదు.. విభిన్న పాత్రాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన వెంకటేష్.. తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమాతో అందరికీ ‘వెంకీ మామ’ అయిపోయారు. అయితే, ఇటీవల ఆయన కుమార్తె ఆర్షితా పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో మాత్రం వెంకి మామ కాస్తా.. వెంకీ తాతగా మారిపోయారు. వెంకీని తాత అని పిలవడం అభిమానులకు రుచించకపోవచ్చు. కానీ, ఆ వీడియోలో ఉన్న ఆ చిన్నారి వెంకటేష్‌కు మనవరాలు.
విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి ప్రస్తుతం స్పెయిన్‌లోని బర్సెలోనాలో ఉంటోంది. అక్కడ ఆమె స్వయంగా ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. అయితే, ఎక్కడా ఆమె తన తండ్రి పేరును ఉపయోగించకుండా ఆమె ఈ చానెల్ నడుపుతోంది.. ఇప్పటివరకు ఈ చానెల్‌కు సుమారు 97 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానెల్‌లో అనేక బేకరీ, భారతీయ వంటకాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆశ్రిత.. తన యూట్యూబ్ చానెల్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. రానా దగ్గుబాటి సోదరి మాళవిక దగ్గుబాటి కుమార్తె ఐరాతో వైట్ చాక్లెట్ యూనికార్న్ ఫడ్జ్ తయారు చేసింది.
ఈ వీడియోలో వెంకటేష్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశ్రిత.. వెంకీ తాతకు కూడా వైట్ చాక్లెట్ యూనికార్న్ ఫడ్జ్ రుచి చూపించని తెలిపింది. ఇన్ని రోజులు వెంకీ మామగా మాత్రమే సుపరిచితులైన వెంకటేష్.. ఈ వీడియోలో వెంకీ తాతగా మారిపోయారు. ఈ వీడియోలో ఎంతో ఉత్సాహంగా, సరదాగా కనిపించారు. వెంకీని ఈ వీడియోలో చూసిన ఆయన అభిమానులు తమ ఆనందాన్ని కామెంట్ల ద్వారా వ్యక్తం చేశారు. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘F3’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తున్నారు. వరుణ్ తేజ్, మెహ్రీన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
‘వెంకీ తాత’.. వీడియోను ఇక్కడ చూడండి:
ఫుల్ ఎపిసోడ్:
మొదటి వీడియో:
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో పిల్లి కోసం లొల్లి.. హమీదా వింత వ్యాఖ్యలు.. అడ్డంగా బుక్కైన జెస్సీ!
Also Read: బిగ్ బాస్ 5 స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ
Also Read: ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..