పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. పాటలకు కూడా మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు.
కథ ప్రకారం.. వీరిద్దరి మధ్య కొన్ని యాక్షన్ సీన్లు ఉంటాయి. మలయాళం వెర్షన్ లో అయితే ఈ సన్నివేశాలే సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తెలుగులో కూడా అదే రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. కథలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంటిని రానా కూల్చేస్తాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. కానీ ఆ సన్నివేశాలు సరిగ్గా రాలేదని.. మళ్లీ ఇంటి సెట్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి సదరు సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు. ఇదంతా కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో జరుగుతుం దని తెలుస్తోంది.
త్రివిక్రమ్ చాలా వేగంగా రీషూట్ ను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో పవన్ కి భార్యగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా భార్య పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరి ఆ డేట్ కి సినిమాను విడుదల చేస్తారో.. లేక 'ఆర్ఆర్ఆర్' వస్తుందని వెనక్కి తగ్గుతారో చూడాలి!
Also Read: మలయాళ 'బాహుబలి'ని ఓటీటీకి ఇచ్చేశారుగా..
Also Read:కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!
Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్