మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో.. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' అనేది టైటిల్. చైనీస్ భాషలో విడుదల చేయాలని ఈ సినిమాను రూపొందించారు. దానిని హిందీలో 'లడకీ' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి 'అమ్మాయి' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాను జూలై 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో చైనాలో ఉన్న ఫేమస్ కాంటన్ టవర్ పై ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
'అమ్మాయి' చైనీస్ వెర్షన్ 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' చిత్రాన్ని చైనాలో 30 వేల స్క్రీన్లలో విడుదల చేయడానికి చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి రవి శంకర్, డి.ఎస్.ఆర్ సంగీతం అందించారు. ఇండో - చైనీస్ కోప్రొడక్షన్ లో సినిమా రూపొందింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఓ అమ్మాయి ఏం చేసింది? ఏంటి? అనేది కథగా తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రానికి ఈ 'లడకి' నివాళి అని చిత్రబృందం చెబుతోంది.
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్