ఉదయం పడుకుని లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీరు చేసిన పనిలో ఎక్కువ ఇంటర్‌నెట్‌ ప్రమేయం ఉండే ఉంటుంది. ఫుడ్‌ ఆర్డర్ చేయడం నుంచి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడం వరకు అన్నింటికీ ఇంటర్నెట్ ప్రధాన అవసరంగా మారిపోయింది. మరికొందరు ఆన్‌లైన్‌లో గంటగంటలు గడిపేస్తుంటారు. ఇంటర్‌నెట్‌ లేనిదే అడుగు ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. 
 
గూగుల్‌ మాత్రం శుభవార్త చెప్పింది.  ఎలాంటి ఇంటర్‌నెట్‌ అవసరం లేకుండానే జీమెయిల్ మెసేజ్‌లు చదువుకోవచ్చని చెబుతోంది. జీమెయిల్‌ సందేశాలను యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ అవసరాన్ని తొలగించే కొత్త ఫీచర్‌తో జీమెయిల్‌కు వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కూడా మీ మెసేజ్‌లు చదవవచ్చు. ప్రతిస్పందించవచ్చు. సెర్చ్ చేసుకోవచ్చు కూడా.


కొత్త ఫీచర్‌ని గూగుల్‌ సపోర్ట్ అని పిలుస్తారు. దీంతో  మీరు mail.google.comని సందర్శించడం ద్వారా మీరు ఇంటర్నెట్‌ లేనప్పుడు కూడా మీ మెసేజ్‌లు చదవవచ్చు. 


జీమెయిల్‌ను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయగలిగేలా చేయడానికి క్రోమ్‌లో పేర్కొన్న లింక్‌ను బుక్‌మార్క్ చేయమని గూగుల్‌ సిఫార్సు చేస్తుంది. మీరు మీ కార్యాలయం లేదా పాఠశాల ఖాతాతో జీమెయిల్‌ను ఉపయోగిస్తుంటే, మీ సెట్టింగ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. 


దీన్ని ఎలా సెట్‌ చేయాలంటే...


1. ముందుగా, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
2. ఆపై జీమెయిల్‌ ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
3. 'ఆఫ్‌లైన్ మెయిల్‌ను అనే ఆప్షన్‌ సెలెక్ట్ చేయండి.
4. ఎన్ని రోజుల మెసేజ్‌లను సింక్రనైజ్‌ చేయాలో మీ సెట్టింగ్‌లలో ఎంచుకోవచ్చు.
5. ఆపై 'మార్పులను సేవ్‌ చేసే బటన్‌పై క్లిక్ చేయండి. 


పోర్టల్‌ను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించడానికి జీమెయిల్‌ను బుక్‌మార్క్ చేయాలి. బుక్ మార్క్ చేయాలంటే క్రోమ్‌ యూఆర్‌ఎల్‌ పక్కనే స్టార్‌ గుర్తు ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ అడ్రెస్‌ బుక్‌మార్క్‌లోకి వెళ్తుంది. తర్వాత మనకు అవసరమైనప్పుడు ఈ బుక్‌మార్క్ క్లిక్‌ చేసి అందులో ఉండే జీమెయిల్‌కు నేరుగా వెళ్లిపోవచ్చు.