Kurchi Madathapetti Lyrical song, Watch Here: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీని మడతపెట్టి...' సాంగ్ లిరికల్ వీడియో ఇవాళ విడుదలైంది. ప్రోమో విడుదల చేసినప్పటి నుంచి 'కుర్చీని మడత పెట్టి...' పదం వాడకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది సినిమాకు బోలెడంత ప్రచారం తీసుకు వస్తోంది.


కుర్చీని మడతపెట్టి పాటలో...
మహేష్ బాబు మాట కూడా!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'అరవింద సమేత వీరరాఘవ' నుంచి ఆయనతో తమన్ ట్రావెల్ అవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు మాత్రమే కాదు... ఆయన పర్యవేక్షణలో రూపొందే సినిమాలకు కూడా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.


'కుర్చీని మడతపెట్టి...' పాటకు తమన్ మాంచి మాస్ బాణీ అందించగా... సాహితి చాగంటి, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. పాట మధ్యలో మహేష్ బాబు 'ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి.... మడతెట్టి పడేయండి' అంటూ డైలాగ్ చెప్పడం విశేషం.


Also Readబబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?  



'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో 'గుంటూరు కారం' రూపొందుతోంది. ఇందులో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే... మహేష్ బాబును మాంచి మాసీగా చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు విడుదల చేసిన మెజారిటీ స్టిల్స్ అన్నిటిలో బీడీ కలుస్తూ కనిపించారు మహేష్. సినిమాలో ఇంకెన్ని కాలుస్తారో చూడాలి. 


Also Readమానసా చౌదరి రొమాన్స్ మామూలుగా లేదుగా, ఒక్క పాటలో 14 లిప్ కిస్‌లు!






హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది.


Also Readడెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?



'గుంటూరు కారం' విడుదల అవుతున్న రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్', తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి. కింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రూపొందుతోన్న 'నా సామి రంగ' సైతం సంక్రాంతి బరిలో విడుదల అవుతోంది.