బుల్లితెరపై ఫ్యామిలీ యాంకర్ అని సుమ కనకాల (Suma Kanakala)కు మంచి ఇమేజ్ ఉంది. యాంకరింగ్ చేసేటప్పుడు ఆవిడ ఎప్పుడు హద్దులు దాటింది లేదు. సుమ కుమారుడు హీరోగా పరిచయం అవుతున్నాడని ప్రేక్షకులకు తెలిసిన తర్వాత... క్లీన్ అండ్ ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అందరూ ఆశించారు. అయితే... మోడ్రన్ యూత్ ఫిల్మ్ 'బబుల్ గమ్'తో రోషన్ కనకాల (Roshan Kanakala)ను పరిచయం చేశారు సుమ, రాజీవ్ కనకాల దంపతులు!
'బబుల్ గమ్'కు సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్స్, రొమాన్స్ వల్ల 'పెద్దలకు మాత్రమే' అని తేల్చారు. సినిమా చూసిన తర్వాత చాలా మంది ఆ రొమాన్స్ చూసి షాక్ అయ్యారు. ముఖ్యంగా మూతి ముద్దులు చూసి ఔరా అని నోరెళ్ళబెట్టారు.
గోవాలో... ఆ ఒక్క పాటలో 14 లిప్ లాక్స్!
'బబుల్ గమ్' సినిమాలో హీరో హీరోయిన్లు గోవా వెళతారు. అప్పుడు పాట వస్తుంది. ఆ ఒక్క పాటలో మెయిన్ లీడ్ మధ్య అక్షరాల 14 మూతి ముద్దులు ఉన్నాయి. ఇక, సినిమాలో అయితే ఇంకా ఉన్నాయి. రొమాంటిక్ మూమెంట్స్ బావున్నాయి. గోవా నుంచి తిరిగి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ల మధ్య గొడవ కావడంతో విడిపోయినా మళ్ళీ కలిసిన తర్వాత సైతం కిస్ సీన్స్ ఉన్నాయి. గోవా నేపథ్యంలో వచ్చే పాటను అయితే రవికాంత్ పేరేపు రొమాంటిక్ గా తీశారు.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?
సాధారణంగా తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావడం తక్కువ అని, ఒకవేళ అడపా దడపా కొందరు వచ్చినా సరే రొమాంటిక్ సీన్స్ చేయడానికి 'నో' అని చెప్పేస్తున్నారని దర్శక నిర్మాతలు కొందరు చెబుతారు. అయితే... 'బబుల్ గమ్' సినిమాలో నటించిన తెలుగమ్మాయి మానసా చౌదరి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ లాక్స్, రొమాన్స్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదనే మెసేజ్ ఇచ్చారు. సినిమా హైలైట్స్‌లో మానస గ్లామర్ గురించి ఎక్కువ మంది ప్రస్తావించడం విశేషం. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.
'బబుల్ గమ్' రోషన్ కనకాలకు మొదటి సినిమా అయినప్పటికీ... మంచి నటన కనబరిచారని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఈ సినిమాతో నాయికగా పరిచయమైన మానసా చౌదరి (Manasa Choudhary)కి అయితే ఇంకా మంచి పేరు వచ్చింది. గ్లామర్ గాళ్ అనిపించుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్... మంచి పెరఫార్మన్స్ చేశారని ప్రశంసలు సైతం అందుకున్నారు. పతాక సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ కొన్నిటిలో మానసా చౌదరి నటనకు మంచి పేరు వస్తోంది.
రోషన్ కనకాల, మానసా చౌదరి నటనకు పేరు అయితే వచ్చింది కానీ సినిమాకు ఆ స్థాయిలో పేరు రాలేదు. కంటెంట్ ఏవరేజ్ అని మెజారిటీ విమర్శకులు స్పష్టం చేశారు. దాంతో సినిమాకు గొప్ప రివ్యూలు ఏమీ రాలేదు. పెయిడ్ ప్రీమియర్ షోలు వేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమాకు కలెక్షన్స్ ఆశించిన రీతిలో లేవు.