Roshan Kanakala's Bubblegum Movie Review In Telugu: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'బబుల్ గమ్'. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి హిట్ సినిమాలు తీసిన రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన తాజా చిత్రమిది. తెలుగు అమ్మాయి మానసా చౌదరి కథానాయికగా నటించారు.
శుక్రవారం (అంటే డిసెంబర్ 29న) థియేటర్లలోకి 'బబుల్ గమ్' సినిమా వచ్చింది. అయితే... గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ సహా కొన్ని ప్రాంతాలలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. సినిమా టాక్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో జనాలు ఏమంటున్నారు? అనేది ఒక్కసారి చూస్తే...
మహేష్ బాబు పాటతో సినిమాలో ఫస్ట్ ఫైట్!
Bubblegum Movie Review Telugu: 'బబుల్ గమ్'లో హీరో ఇంట్రడక్షన్ తర్వాత వచ్చే ఫస్ట్ ఫైట్ మహేష్ బాబు అభిమానులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఫైట్ నేపథ్యంలో సూపర్ స్టార్ 'నాని' సినిమాలో 'పెదవే పలికిన మాటల్లో తీయటి మాటే అమ్మ' వినిపించిందని నెటిజనులు పేర్కొన్నారు. ఫైట్ సంగతి పక్కన పెట్టి సినిమా విషయానికి వస్తే...
న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ... ఒక్కసారి చూడొచ్చు!
Bubblegum movie review: 'బబుల్ గమ్' న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ సినిమా అని... కొన్ని సన్నివేశాలు బాగా అనిపిస్తే, మరికొన్ని బాలేదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. రవికాంత్ పేరేపు కథ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ, కథను తెరకెక్కించిన విధానం యునీక్‌గా ఉందన్నారు. రోషన్ కనకాల తన నటనతో ఆకట్టుకున్నాడని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ బాగా చేశాడని చెప్పారు. జాన్వీ పాత్రలో కథానాయిక మానసా చౌదరి బావుందన్నారు. సిద్ధూ జొన్నలగడ్డ బ్రదర్ చైతన్య జొన్నలగడ్డ టైమింగ్ కేక అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఫస్టాఫ్ ఓకే అని, సెకండాఫ్ ఏవరేజ్ అని స్పష్టం చేశారు. పెర్ఫార్మన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చని ట్వీట్ చేశారు.
'బబుల్ గమ్'కు యూత్ కనెక్ట్ అవుతారు... 3/5 రేటింగ్స్!
Telugu Movie Bubblegum Review: 'బబుల్ గమ్' బ్లాక్ బస్టర్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే... మరొకరు యూత్ కనెక్ట్ అవుతారని పేర్కొన్నారు. రోషన్ కనకాల నటన చాలా బావుందని మెజారిటీ నెటిజనులు ప్రశంసించారు. ఫస్టాఫ్ బావుందని, సెకండాఫ్ ఓకే అని ఎక్కువ మంది చెబుతున్నారు. కొందరు సినిమాకు 3/5 రేటింగ్స్ ఇచ్చారు.
Also Read: చిరంజీవికి కలిసి వచ్చిన విజయకాంత్ కథలు - ఇంకా కెప్టెన్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసింది ఎవరు?
ఏవరేజ్ బొమ్మ... సోషల్ మీడియాలో టాక్ బాలేదు!
Bubblegum Review Telugu: ''సినిమాలో లవ్ గురించి వాళ్ళకు క్లారిటీ లేదు. లాస్ట్ సినిమా గురించి మనకి క్లారిటీ రాదు. సినిమాని లేపే అంత కంటెంట్, కనెక్టివిటీ లేదు. మరీ స్కిప్ చేసే అంత చెత్తగా సినిమా లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే... బిలో ఏవరేజ్ బొమ్మ'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ''సినిమా ఏవరేజ్ అంట కదా! బయట టాక్'' అంటూ మరొక నెటిజన్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సినిమా టాక్ అసలు బాలేదు. మరి, థియేటర్లలో నెటిజన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: విజయకాంత్ 'కెప్టెన్ ప్రభాకరన్' - బ్లాక్‌బస్టర్ వెనుక వివాదాలు, గాయాలు!