Modi Ayodhya Visit: 


ఎయిర్‌పోర్ట్ ప్రారంభం..


అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్య ధామ్‌గా (Maharishi Valmiki International Airport Ayodhya Dham) నామకరణం చేసింది ప్రభుత్వం. రూ.1,450 కోట్లతో నిర్మించిన ఈ విమానాశ్రయానికి దేశంలోని నలుమూలల నుంచి ఫ్లైట్ సర్వీస్‌లు నడవనున్నాయి. జనవరి 6 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఏటా 10 లక్షల మంది ప్యాసింజర్స్‌ వినియోగించుకునేలా నిర్మించారు.





ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌టీరియర్‌ అంతా రామ మందిర నిర్మాణ థీమ్‌తో తీర్చి దిద్దారు. స్థానిక కళలు, పెయింటింగ్స్, రామాయణానికి సంబంధించిన ఘట్టాలను ఆ గోడలపై చిత్రించారు. వీటితో పాటు LED లైటింగ్, సోలార్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. Green Rating for Integrated Habitat Assessment సర్టిఫికేషన్‌ సాధించడమే లక్ష్యంగా అన్ని వసతులూ కల్పించారు. ఇప్పటికే IndiGo,Air India Express సర్వీస్‌లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించక ముందు ప్రధాని మోదీ లతా మంగేష్కర్ చౌక్‌ని సందర్శించారు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కాసేపు అక్కడే గడిపారు ప్రధాని.  






ఎయిర్‌పోర్ట్ ప్రారంభించిన వెంటనే ఢిల్లీ నుంచి ఇండిగో ఫ్లైట్‌ తొలి సర్వీస్‌ని మొదలు పెట్టింది. ఈ ఫ్లైట్ ఎక్కే సమయంలో భక్తుల జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ల కాసేపు సందడి చేశారు. ఆ తరవాత ప్రధాని మోదీ పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. రూ.15,700 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లతో అయోధ్య రూపురేఖలు మారిపోనున్నాయి.






అయోధ్య రైల్వే స్టేషన్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న స్టేషన్‌కి కొత్త హంగులు అద్ది మరింత అందంగా తీర్చి దిద్దారు. దీనికి అయోధ్య ధామ్ జంక్షన్ (Ayodhya Dham Junction) అని పేరు పెట్టారు. ఈ రెనోవేషన్‌ కోసం ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసింది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, వెయిటింగ్‌ హాల్స్, క్లాక్‌రూమ్స్‌తో పాటు ఫుడ్ ప్లాజాలు ఏర్పాటు చేసింది. రామ మందిర ఆకృతిలోనే స్టేషన్‌ని తీర్చి దిద్దారు.


Also Read: టెంట్‌లో ఉన్న రాముడికి మందిరమే సిద్ధమైంది, ఇది ఆధునిక అయోధ్యకు అంకురార్పణ - ప్రధాని మోదీ