సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఇటీవల తిరిగి రాని లోకాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు రమేష్ బాబు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. ముఖ్యంగా  అన్నయ్య అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టం. ఓ విధంగా ప్రాణం అని చెప్పాలి. అయితే... అన్నయ్య మరణించిన సమయంలో కరోనా సోకడంతో చివరి చూపు చూడడానికి వీలు పడలేదు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకోవడంతో అన్నయ్య ఇంటికి వెళ్లిన మహేష్... వదిన, పిల్లలను పరామర్శించి వచ్చారు.


రమేష్ బాబు పెద్ద కర్మ శనివారం జరిగింది. కృష్ణ, మహేష్ బాబు, ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రమేష్ బాబు ఇంట్లో కర్మ జరిగింది. ఘట్టమనేని కుటుంబ సభ్యులు మధ్య భావోద్వేగభరిత వాతావరణం అందరినీ కలచివేసింది. అన్నయ్య చివరి చూపు దక్కని మహేష్, కన్నీటి పర్యంతం అయ్యారని సమాచారం. 










Also Read: పన్నెండు వారాల ముందుగానే... ప్రియాంకా చోప్రా పాప గురించి ఈ సంగతులు తెలుసా?
Also Read: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?
Also Read: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి