Kotabommali PS movie collection worldwide: కంటెంట్ బేస్డ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... 


ఓపెనింగ్స్ డే కంటే రెండో రోజు ఎక్కువ!  
'కోట బొమ్మాళి పీఎస్' సినిమాలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ (Srikanth) మేక ప్రధాన పాత్ర పోషించారు. ఎస్పీ రజియా అలీ పాత్రలో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) నటించారు. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్. 


అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో  జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన చిత్రమిది. ఆహా ఓటీటీలో డైరెక్టుగా విడుదలైన 'జోహార్', శ్రీ విష్ణు కథానాయకుడిగా తీసిన 'అర్జున ఫాల్గుణ' తర్వాత తేజా మార్నిదర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళ హిట్ 'నాయట్టు'ను 'కోట బొమ్మాళి పీఎస్'గా రీమేక్ చేశారు.


Also Readసుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!


'కోట బొమ్మాళి పీఎస్' సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి 1.75 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. రెండో రోజు రూ. 2.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఓపెనింగ్స్ డే కంటే 50 శాతం రెండో రోజు కలెక్షన్స్ పెరగడం విశేషం. విమర్శకుల నుంచి సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా బావుంది. 


Also Readత్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?






'ఆహా' ఓటీటీకి 'కోట బొమ్మాళి పీఎస్' 
Kotabommali PS movie digital rights acquired by AHA Telugu OTT: 'కోట బొమ్మాళి పీఎస్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ సినిమా డిజిటల్ పార్ట్నర్ 'ఆహా' అని చిత్ర బృందం పేర్కొంది. న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండగ సందర్భంగా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply



'కోట బొమ్మాళి' రీమేక్ సినిమా అయినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలను కథకు అద్దడంలోనూ, మన నేటివిటీకి తగ్గట్లు సినిమా తీయడంలోనూ దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. మురళీ శర్మ, బెనర్జీ, దయానంద్, సివిఎల్ నరసింహారావు, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి, మాటలు : నాగేంద్ర కాశి, కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం : గాంధీ నడికుడికర్, సంగీతం : రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అజయ్ గద్దె, కాస్ట్యూమ్ డిజైనర్ : అపూర్వ రెడ్డి.