ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న టీమిండియా... కంగారులపై రెండో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి అధిక్యం సాధించాలని యువ భారత్ పట్టుదలగా ఉంది. ఆసీస్ కూడా బోణీ కొట్టాలని చూస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ బౌలర్లకు ప్రధానంగా స్పిన్నర్లకు సహరికంచే అవకాశం ఉండడంతో తక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ స్టేడియంలో మెుత్తం 3అంతర్జాతీయ టీ20మ్యాచ్‌లు జరగగా రెండింటిలో ఛేజింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
విశాఖలో జరిగిన మెుదటి టీ-20లో రాణించిన కెప్టెన్ సూర్యకుమార్‌తోపాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, రింకూసింగ్‌లు మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. దురదృష్టవశాత్తు మెుదటి మ్యాచ్‌లో రనౌటైన రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో రాణించాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మొదటి టీ-20 మ్యాచ్‌లో....భారత్ బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యింది. పేసర్ ముఖేశ్ కుమార్ మినహా బౌలర్లంతా విఫలమయ్యారు. పేసర్లు అర్షదీప్ సింగ్, ప్రసిద్ధకృష్ణలు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు పూర్తిగా విఫలమయ్యారు. గ్రీన్‌ఫీల్డ్ పిచ్ స్పిన్‌కు అనుకూలం కావటంతో వారి ప్రదర్శనపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మెుదటి టీ-20 మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన ఆసీస్ సిరీస్‌లో బోణీకొట్టాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన జోష్ ఇంగ్లిస్‌తోపాటు సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఫామ్‌లో ఉండడం కలిసివచ్చే అవకాశం ఉంది. స్టార్ ఆటగాళ్లు మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్‌లు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నా ఆసీస్ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రెండో టీ-20లో స్పిన్నర్లు జంపా, తన్వీర్ సంగాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 5 టీ ట్వంటీల సిరీస్‌లో ఆధిక్యాన్నిన2-0కు పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా...... పరాజయం పాలవ్వడం కంగారులను ఆందోళనకు గురి చేస్తోంది. చివరి బంతి వరకూ పోరాడినా విజయం దక్కకపోవడంపై ఆస్ట్రేలియన్లు ఆందోళనగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సమస్యలను అధిగమించి విజయం సాధించాలని ఆసిస్ గట్టి పట్టుదలతో ఉంది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్.