'కొడితే...' అంటూ తమన్నా సంక్రాంతి రోజున ఓ స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గని'. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. ఈ రోజు ఆ పాటను విడుదల చేశారు.
బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా స్పెష‌ల్ సాంగ్‌ను కూడా బాక్సింగ్ రింగ్‌లో డిజైన్ చేశారు. అందుకు తగ్గట్టు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ పాటను ఆలపించారు. లిరిక‌ల్ వీడియోలో త‌మ‌న్నా వేసిన కొన్ని స్టెప్స్ కూడా చూపించారు. ఆమె అదరకొట్టిందని ఆడియన్స్ అంటున్నారు. తమన్నా పాటలో ఇరగదీశారని, తమన్ ట్రాక్ నచ్చిందని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.





కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటించారు. ఈ ఏడాది మార్చి 18న సినిమా విడుదల కానుంది.






Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియ‌ల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి