కీర్తీ సురేష్ నల్లకోటు (Keerthy Suresh As Lawyer) వేశారు... ఆమెతో పాటు హీరో టోవినో థామస్ (Tovino Thomas As Laywer) కూడా! వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'వాశి' (Vaashi Movie). ఇందులో ఇద్దరూ లాయర్లు అన్నమాట. ఈ రోజు (శనివారం సాయంత్రం) నాలుగు గంటలకు సినిమా ఫస్ట్ లుక్ విడుదల అని చెప్పారు. కానీ, అంత కంటే ముందు లుక్ లీకైంది. నల్లకోటు వేసుకుని కీర్తీ సురేష్ కుర్చీలో కూర్చుంటే... ఆమెకు అండగా అన్నట్టు వెనుక నిలబడి ఉన్న టోవినో థామస్ లుక్ (Vaashi Movie First Look) అందరినీ ఆకట్టుకుంటోంది.


మలయాళంలో మోహన్ లాల్, మంజూ వారియర్... తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత... తమిళంలో ఏఆర్ రెహమాన్, సమంత... హిందీలో అభిషేక్ బచ్చన్ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తున్నారు. బహుశా... సినిమాను మలయాళంలో కాకుండా, ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు.


Also Read: ట్రోలింగ్ ఆపేస్తారా? 10 కోట్లు కడతారా? - మంచు ఫ్యామిలీ హెచ్చరిక


కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కీర్తీ సురేష్ షూటింగ్ చేసిన ఫస్ట్ మూవీ 'వాశి'యే. ఈ సినిమాకు ఆమె తండ్రి జి. సురేష్ కుమార్ నిర్మాత. అందువల్ల, 'వాశి' ఆమెకు మరింత స్పెషల్ అని చెప్పాలి. కీర్తీ సురేష్ సోదరి రేవతి పేరు మీద రేవతి కళామందిర్ పేరుతో సురేష్ కుమార్ నిర్మాణ సంస్థ స్థాపించారు. మలయాళంలో పాతిక సినిమాలకు పైగా నిర్మించారు. తొలిసారి తన తండ్రి ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో కీర్తీ సురేష్ నటించారు. ఈ సినిమా కీర్తీ సురేష్ ఫ్రెండ్ విష్ణు రాఘవ్ దర్శకత్వం వహించారు. 


Also Read: శ్రీరాముడి దగ్గర హనుమంతుడిలా మహేష్ దగ్గర ఆయన!




— Mahesh Babu (@urstrulyMahesh) February 19, 2022