నట సింహ నందమూరి బాలకృష్ణ 40 నిమిషాల పాత్రలో కనిపించడానికి 'ఎస్' అంటారా? దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిపాదనకు 'ఓకే' చెబుతారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ హాట్ డిస్కషన్. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ, బాలకృష్ణ 'సరే' అంటే... ఓకే ఫ్రేములో బాలకృష్ణ - మహేష్ బాబులను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుంది. అసలు వివరాల్లోకి వెళితే...


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ ఈ సినిమాకు నిర్మాత. మరొకరు నిర్మాణంలో భాగస్వామి అయ్యే అవకాశాలు ఉన్నాయట. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఇదొక మల్టీస్టారర్. ఇందులో మహేష్ బాబు మెయిన్ హీరో. అయితే.... హీరోతో పాటు ఈక్వ‌ల్ ఇంపార్టెన్స్ ఉండే పాత్ర ఒకటి ఉందట. సుమారు 40 నిమిషాల నిడివి గల ఆ పాత్రకు బాలకృష్ణ అయితే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నారట. మరి, బాలయ్య ఏమంటారో? స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యేవరకూ ఆ క్యారెక్టర్ ?ఉంటుందో? లేదో? చూడాలి.


Also Read: శ్రీరాముడి దగ్గర హనుమంతుడిలా మహేష్ బాబు దగ్గర పట్టాభి! ఇంతకీ, ఆయన ఎవరో తెలుసా?


బాలకృష్ణతో సినిమా చేయాలని రాజమౌళికి ఎప్పటి నుంచో ఉంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పుడు ఒక కథ చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు అయ్యాక... బాలయ్యతో సినిమా చేయాలని కూడా ఉన్నారు. 'సింహాద్రి' కథ నట సింహ కోసం అనుకున్నదే. అటు బాలకృష్ణకూ రాజమౌళితో సినిమా చేయాలని ఉంది. 'అన్ స్టాపబుల్' షోలో రాజమౌళిని 'నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్?' అని అడిగారు. మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి ప్రస్తుతం అనుకుంటున్న కథ ఖరారు అయ్యి, అందులో మరో పాత్ర చేయడానికి బాలకృష్ణ ఓకే అంటే... నట సింహ, సూపర్ స్టార్, దర్శక ధీరుడు కలయికలో మనం సినిమా చూడొచ్చు. అదీ విషయం.  


Also Read: ఫుల్లుగా మందు తాగి కారు నడిపిన హీరోయిన్... యాక్సిడెంట్ చేయడంతో ఒకరికి గాయాలు... ఆ తర్వాత పోలీసులతో గొడవ