కార్తీకదీపం ఫిబ్రవరి 2 బుధవారం ఎపిసోడ్


శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లిన కార్తీక్, దీప కంగారు పడుతుంటారు. ఏ డాక్టరూ ముందుకు రాకపోవడంతో కార్తీక్ ట్రీట్మెంట్ మొదలుపెడతాడు.  ఇక తన క్యాబిన్ లో కూర్చున్న డాక్టర్ అక్కడ సీసీ ఫుటేజీ ఆధారంగా కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆశ్చర్యపోతుంటుంది.  కార్తీక్ ఎవరికీ కనిపించకుండా దీప వాళ్లను అడ్డుగా ఉండమని చెబుతాడు. అక్కడున్న నర్స్ వచ్చి ఏం చేస్తున్నారు..మీరు ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటారని క్వశ్చన్ చేస్తుంది. వెంటనే మరో పేషెంట్ కి సీరియస్ గా ఉందని తెలిసి అక్కడి నుంచివెళుతుంది. కార్తీక్ మాత్రం శౌర్యని కాపాడే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగి అక్కడున్న స్టాఫ్ నర్స్ పై అరుస్తుంది. హాస్పిటల్ కి వచ్చి అన్నీ మీరే చేసుకుంటే మేం ఎందుకు ఇక్కడ..  మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండంటుంది డాక్టర్...


Also Read:   శౌర్య బతకాలంటే డాక్టర్ కార్తీక్ రావాలన్న మరో డాక్టర్, రప్పిస్తా అన్న వంటలక్క.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
మరోవైపు మోనిత.. ఆదిత్య, శ్రావ్య వాళ్లకు ఎదురుపడుతుంది. ఎప్పటిలా మాటల తూటాలు పేలుతాయి. మనం అంతా ఒక్కటే, అంతా ఒకేఫ్యామిలీ, నీ దీపూ గాడికి తమ్ముడిని ఇచ్చాను, ఆ ఇంటికి మరో వారసుడిని ఇచ్చాను అంటూ తన స్టైల్లో వాగుతూ ఉంటుంది. నీకు-మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు చేసిన పనులు వల్ల జరిగింది చాలు.. నాకు మా దీపక్కలా ఓపిక లేదు, నేను మా అమ్మ భాగ్యం టైప్.. ఇక్కడి నుంచి పో అని క్లాస్ వేస్తుంది శ్రావ్య. స్పందించిన మోనిత... చూడమ్మా చిట్టిచెల్లెలు అంటూ ...దీప పెద్ద కొడలు, నేను దేవుడిచ్చిన కోడలు, నువ్వు చిన్న కోడలివి అంటుంది. నన్ను ఇంట్లోకి రాకుండా చేయడంలో నీ పాత్ర కూడా ఉంది కదా అన్న మోనిత.. మీ అన్నయ్య, వదిన, పిల్లల్ని వెతక్కుండా గాలికి తిరిగుతున్నారేంటి... మీరే ఎక్కడైనా దాచి పెట్టారా.. మీరంతా ఏం చేసినా ఆ ఇంట్లోకి రావడాన్ని ఆపలేరు... పదిరోజుల్లో కార్తీక్, బాబులతో మీ ముందు ఉంటానని శపథం చేస్తుంది. 


Also Read: మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ… జోరందుకున్న రిషి-వసు లవ్ ట్రాక్, గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
డాక్టర్ దగ్గరకు వెళ్లిన దీప-కార్తీక్ ..శౌర్యకి ట్రీట్మెంట్ చేయాలని ప్రాధేయపడతారు. సొంత వైద్యం చేసుకుని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని మండిపడుతుంది. కాసేపు బతిమలాడడంతో మరో డాక్టర్ కి రిఫర్ చేస్తానని చెప్పి డబ్బు ఏర్పాట్లు చేసుకోండి అంటుంది. డాక్టర్ ధనుంజయ్ దగ్గరకు పాపను తీసుకెళ్లండి అని చెబుతుంది. మరోవైపు  రుద్రాణి కూడా కార్తీక్, దీప గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతుంది. వాళ్ళు ఎక్కడున్నారని తన మనుషులను అడుగుతుంది. వారిని ఎలాగైనా పట్టుకుంటానని.. ఏం చేసైనా సరే హిమను లాక్కుని తాడికొండలో ఇంకో రుద్రాణిని తయారు చేయబోతున్నా అంటుంది.  అటు హాస్పిటల్లో శౌర్య పరిస్థితి చూసిన డాక్టర్ ధనుంజయ్...పరిస్థితి సీరియస్ గానే ఉందంటాడు. గతంలో ఇలాంటి ట్రీట్మెంట్ జరిగిందా అంటే హార్ట్ కి సర్జరీ జరిగిందని చెబుతాడు కార్తీక్.  ఎవరు చేశారని అడిగితే... డాక్టర్ కార్తీక్ చేశారని చెబుతారు. అక్కడున్న డాక్టర్లిద్దరూ షాక్ అవుతారు..మీ పాపకి అంత పెద్ద డాక్టర్ ఎలా చేశారు, ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరకదు అంటారు. స్పందించిన దీప ... కార్తీక్ గారి ఇంట్లో వంటమనిషిగా చేశానంటుంది దీప. అయితే ఈ సర్జరీ చేయడం నా వల్ల కాదన్న ధనుంజయ్...మళ్లీ డాక్టర్ కార్తీక్ రావాలంటాడు. 


Also Read: దీప కన్నీళ్లకు కార్తీక్ కరుగుతాడా, కూతురికోసం మళ్లీ డాక్టర్ గా యూ టర్న్ తీసుకుంటాడా... కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
రేపటి( గురువారం) ఎపిసోడ్ 
ఏం చేయాలో అర్థంకావడం లేదు దీప అని కార్తీక్ తలపట్టుకుంటాడు. తన పరిస్థితేంటో నాకన్నా మీకే తెలుసుకదా..చూస్తూ చూస్తూ కళ్లముందే పిల్లని దూరం చేసుకుంటామా.. దాని ప్రాణాలు కాపాడండి అంటుంది. కోటు వేసుకుని డాక్టర్ బాబు రంగంలోకి దిగుతాడు. డాక్టర్ కార్తీక్ వచ్చారా అని హాస్పిటల్లో ఉన్న డాక్టర్ షాక్ అవుతుంది...


Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని అన్నట్టున్న వసు-రిషి, ఊహల్లో గౌతమ్... గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్..