ఫిబ్రవరి 2 బుధవారం రాశిఫలాలు
మేషం
మేష రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో తెలియని అడ్డంకి మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది.  పిల్లల సమస్యల కారణంగా మీరు ఇబ్బంది పడొచ్చు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. కార్యాలయంలో ఎవరితోనైనా  వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.


వృషభం 
ఈరోజు మీ మనసులో చెడు ఆలోచనలు వస్తాయి. తెలియని భయం మీ దినచర్యను ప్రభావితం చేస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలి. విద్యార్థులకు శుభసమయం.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


మిథునం 
ఈరోజు మీరు మీ స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఖర్చు పెరగడం వల్ల మీ నెలవారీ బడ్జెట్ పై ప్రభావం పడుతుంది. గృహ సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు.  రుణ మొత్తాన్ని తిరిగి పొందడం ద్వారా మీ ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. 


Also Read: రామానుజాచార్యుల పైనా కీర్తనలు రాసిన అన్నమయ్య
కర్కాటకం
ఒక వక్ర వ్యక్తి కారణంగా మీరు విమర్శలకు గురవుతారు. మిమ్మల్ని వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తారు..మీరు ప్రశాంతంగా ఉండండి. మొదట్లో మీపై కోపంగా ఉన్నా కాలక్రమేణా మీ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారిలో చాలామంది మిమ్మల్ని వెనక్కి లాగేవారే అని గుర్తించండి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు పూర్తిచేసుకుంటారు. 


సింహం
ఈ రోజు మీ పాత స్నేహితులను కలుస్తారు. పని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు మంచి సమయం ఇది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వాహనం, గృహావసరాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల ఆశీస్సులతో మీ పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండండి. 


కన్య
ఈ రోజు ఏదో అసౌకర్యంగా ఫీలవుతారు. ఆర్థికపరంగా సాధరణంగా ఉంటుంది. ఆలయాలను సందర్శఇస్తారు. వ్యాపారాన్ని ఎవ్వరి చేతుల్లోనూ పెట్టొద్దు.  అనుకోని సమస్యలు వెంటాడుతాయి. ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. 


Also Read: రామానుజాచార్యుల దివ్యశరీరం ఇంకా భద్రపరిచే ఉంది... మీరు చూశారా...
తుల
కార్యాలయంలో అధికారుల నుంచి ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. చాలా కాలం తర్వాత తోబుట్టువులు కలిసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉండేవారి ఉన్నత ఉద్యోగం పొందుతారు.  విద్యార్థులు పరీక్షల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. మీ బాధ్యతను నెరవేర్చడంలో అలసత్వం వహించకండి. మీరు ఈరోజు సమాజంలో గౌరవం అందుకుంటారు. 


వృశ్చికం
ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేయడంలో బిజీగా ఉంటారు. బహిరంగ ప్రదేశంలో ఎవరితోనైనా విబేధాలు రావొచ్చు.  మీ కోపాన్ని నియంత్రించుకోండి, లేకుంటే గొడవలు జరగవచ్చు. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. మీకు పూర్వీకుల ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద లాభాలను పొందొచ్చు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. 


ధనుస్సు 
ఈరోజు మీరు రాజకీయ విషయాలపై స్నేహితులతో వాగ్వాదానికి దిగొచ్చు. మీ నైపుణ్యాలతో సమస్యల నుంచి బయటపడినా మరికొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కాస్త ఆలోచించండి. 


Also Read: శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…
మకరం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. తెలియని వ్యక్తితో మీరు ఇబ్బందుల్లో పడతారు. విలువైన వస్తువులను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోండి. చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న ఈ వ్యవహారం ఈరోజు తేలవచ్చు. కార్యాలయంలోని సహోద్యోగుల సహకారంతో మీ పని పూర్తి అవుతుంది.


కుంభం 
సామాజిక లేదా మతపరమైన బాధ్యత కారణంగా అలసిపోతారు. ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించాలంటే నిర్లక్ష్యాన్ని వీడండి. ఆహారం విషయంలో నియంత్రణ పాటించండి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయండి. ఈరోజు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. 


మీనం 
మీ సామాజిక స్థితి బలంగా ఉంటుంది. కార్యాలయంలో మీరు కొత్త ప్రాజెక్ట్‌లపై పని చేయడం గురించి సమాచారాన్ని పొందుతారు. ప్రమోషన్ కి సంబంధించిన సమచారం అందుకుంటారు.  వ్యాపారంలో వేగం తగ్గుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తిచేయడం ఈ రోజు కాస్త కష్టమే..


Also Read: ముచ్చింతల్‌ లో రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల షెడ్యూల్ ఇదే..