గుప్పెడంతమనసు జనవరి 31 సోమవారం ఎపిసోడ్


తండ్రి సంతోషం కోసం తల్లి జగతిని..రిషి ఇంటికి తీసుకురావడం, వసుధార కూడా రావడంతో దేవయాని మండిపడుతుంటుంది. ఇంతలో భర్త ఫణీంద్ర పిలిచి... జగతి, మహేంద్రకి బట్టలు పెడదామని అడుగుతాడు. నాచేత్తో జగతిని అస్సలు బట్టలు పెట్టనంటూ దేవయాని వెళ్లిపోతుంటుంది. అదే సమయానికి రిషి రావడం చూసి డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏది ఏమైనా ఇంటికొచ్చిన వాళ్లని గౌరవించుకోవడం మన సంస్కారం కదా అని చెప్పి ఫణీంద్ర చేతిలో బట్టలు తీసుకుంటుంది. ఇంతలో రిషి వెళ్లిపోవడంతో ఆ బట్టలు తిరిగి ఫమీంద్ర చేతిలో పెట్టేస్తుంది. మళ్లీ రిషి వచ్చినా వస్తాడనగానే బట్టలు అందిస్తుంది. కాళ్లకు నమస్కారం చేసేందుకు ప్రయత్నించగానే దేవయాని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా చూస్తున్న రిషి..డాడ్ కళ్లలో ఎప్పుడూ లేనంత కొత్త వెలుగు చూస్తున్నా అనుకుంటాడు. అటు వసుధార ఈ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే ఉంటే బావుండును అనుకుంటుంది. 


Also Read: దీప కన్నీళ్లకు కార్తీక్ కరుగుతాడా, కూతురికోసం మళ్లీ డాక్టర్ గా యూ టర్న్ తీసుకుంటాడా... కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
రూమ్ లో బెడ్ పై ఉన్న మహేంద్ర..జగతి రాకను మరోసారి తలుచుకుని ఇది నిజంగా అద్భుతం.. జగతి ఈ ఇంటికి రావడం అద్భుతం కన్నా ఎక్కువే..జీవితంలో గొప్ప సంతోషాన్నిచ్చావ్ అనుకుంటాడు. అటు రిషి కూడా మహేంద్ర మాటలు తల్చుకుంటాడు.. సంతోషం అంటే పొద్దున్నే నిద్రలేవగానే కాఫీ ఇచ్చే భార్య.. నువ్వు ఆమె కలసి అల్లరి చేయడం అనే మాటలు గుర్తుచేసుకుంటాడు. డాడ్ కళ్లలో సంతోషం చూశాననుకుంటాడు.  వసుధారకి దెబ్బతగలడం బాధగా ఉందనుకున్న రిషి..వసుధార ఏం చేస్తోందో నిద్రపోతోందా అనుకుంటాడు. కట్ చేస్తే జగతి-వసుధార మట్లాడుకుంటారు. ఈ రోజు మీరు నిద్రపోతారా అంటే నిద్రరాదేమో వసు అంటుంది జగతి. ఎన్నేళ్లు ఎదురుచూశారు, ఎన్ని బాధలు పడ్డారు వాటన్నింటికి ప్రతిఫలం ఇది అంటుంది. నువ్వు నిద్రపో నాకు నిద్రపట్టదు అంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతుంది. ఈ సంక్రాంతి నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది అనుకుంటుంది. 


Also Read: చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
భోగి మంట దగ్గర నిల్చుని మాట్లాడుకుంటారంతా. తొందరగా క్యాంప్ ఫైర్ వేయండి చలేస్తోందని గౌతమ్ అంటే.. వసుధార క్లాస్ మొదలెడుతుంది. వసుధారా ప్లీజ్ ఆపు అని రిషి అంటే చెప్పనీరా అని గౌతమ్ అంటాడు. ఆపడం కష్టంరా బాబు అని కౌంటర్ ఇస్తాడు రిషి. భోగి మంటల ప్రత్యేకత గురించి మాట్లాడుకుని మంట చుట్టూ ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. తండ్రిని చూసి రిషి మురిసిపోతాడు.  ఇదంతా చూసి రగిలిపోయిన దేవయాని ...మహేంద్ర-జగతి మధ్యలో వచ్చి నిలబడుతుంది. ఏం మహంద్ర నువ్వు పేషెంట్ వి అన్న విషయమే మరిచిపోయినట్టున్నావ్ అంటుంది. నేను సాధారణంగా చాలా విషయాలు మరిచిపోతుంటాను..నన్ను ఎవరైనా తిట్టినా,సూటిపోటి మాటలు అన్నా కూడా మర్చిపోతుంటాను..మతి మరుపు దేవుడిచ్చిన వరం అని కౌంటర్ ఇస్తాడు. పెద్దమ్మ చలిగా ఉందా శాలువా తీసుకొస్తానని రషి వెళుతుంటే గౌతమ్ నేను వెళ్తానంటూ వెళతాడు. 


Also Read:  సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
స్టోర్ రూమ్ లో ఉన్న పాత వస్తువులు తీసుకొచ్చి భోగి మంటల్లో వేయమని ఫణీంద్ర చెప్పడంతో రిషి వెళతాడు... రిషితో పాటూ వసుధార కూడా వెళుతుంది. దేవయాని నీకు గుర్తుందా భోగిపళ్లు పోసేవరకూ రిషి అల్లరి చేసేవాడని ఫణీంద్ర అంటే.. అవునులెండి రిషి చిన్నతనం మనం గుర్తుచేసుకోవాలి కానీ చాలామంది మర్చిపోయారు కదా అని దేవయాని..జగతిపై సెటైర్ వేస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్..రిషి-వసు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లిపోయారనుకుంటాడు. స్టోర్ రూమ్ కి వెళ్లిన వసు..చీకటిగా ఉందేంటి అంటే..లైట్ పోయినట్టుందంటాడు. మీరు దయ్యాలను నమ్ముతారా అని వసు అంటే నేను మనుషుల్ని నమ్ముతాను, దెయ్యాలని కాదు.. ఈ మధ్య మనుషులపై కూడా నమ్మకం పోతుందంటాడు. దయ్యాలు ఉంటాయంటారా అంటే ఈ దయ్యాల గోలేంటని రిషి అడిగితే..చీకట్లో దయ్యాలను గుర్తుచేసుకోవద్దు అనుకుంటూ గుర్తుతెచ్చుకున్నా అంటుంది. చీకట్లో ఒకర్నొకరు చూసుకోకుండా గుద్దుకుంటారు.. భోగిమంటల్లో వేసేందుకు పాత చక్కలు వెతుకుతుంటారు. బ్యాగ్రౌండ్ లో రొమాంటిక్ సాంగ్స్ వస్తుంటాయి. ఇంతలో వసు వేలికి ఏదో గుచ్చుకోవడంతో రిషి కంగారు పడతాడు. అదే సమయానికి అక్కడకు వచ్చిన గౌతమ్... చీకటి గదిలో ఏం చేస్తున్నారు అంటాడు. ఎపిసోడ్ ముగిసింది.....


రేపటి ( మంగళవార)  ఎపిసోడ్ లో
వసు వస్తుంటే పూలు చల్లి థ్రిల్ చేయాలి నాకు కోపరేట్ చేయండి వదినా అని ధరణిని అడుగుతాడు గౌతమ్. ఇంతలో ద్వారం బయట పూలు కడుతున్న రిషి చేతిలోంచి దండ జారి వసు మెళ్లో పడుతుంది. ఇదంతా చూసి రగిలిపోయిన దేవయాని కోపంగా వెళుతూ గౌతమ్ చేతిలో పళ్లెం తోసేస్తుంది..ఆ పూలు మహేంద్ర-జగతిపై పడతాయి..మీ వదిన మీపై పూల వర్షం కురిపించింది మహేంద్ర అంటాడు ఫణీంద్ర....


Also Read: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్