కార్తీకదీపం జనవరి 31 సోమవారం ఎపిసోడ్


డాక్టర్ బాబు వంటలక్క కష్టాలు పీక్స్ కి చేరాయి. స్కిప్పింగ్ ఆడుతూ శౌర్య కళ్లు తిరిగి కిందపడిపోవడంతో  గతంలో గుండెజబ్బు తిరగబెట్టిందా అని దీప, కార్తీక్ అల్లాడిపోతారు. డబ్బుల కోసం కార్తీక్ ప్రకృతి ఆశ్రమానికి వెళ్లేసరికి తల్లిదండ్రులు అక్కడినుంచి వెళ్లిపోతారు. మరోవైపు రుద్రాణి అప్పుతీర్చాలని పట్టుబట్టి అంతలోనే శౌర్య ఆపరేషన్ కి కార్తీక్ కి డబ్బు ఇచ్చి తీసుకోమంటుంది. శనివారం ఎపిసోడ్ అక్కడితో ముగిసింది....


సోమవారం ( జనవరి 31) ఎపిసోడ్ రుద్రాణి-కార్తీక్ డిస్కషన్ తోనే మొదలైంది. ఇచ్చిన అప్పు ఎలాగూ తీర్చలేవు ఈ డబ్బులు కూడా తీసుకో...నీ పిల్లల్లో ఒకర్ని ఇవ్వు అని డబ్బులు చేతిలో పెడుతుంది. ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేసిన కార్తీక్.. గడువులోగా నీ డబ్బులు ఎలాగైనా తిరిగి చెల్లిస్తాను అని చెప్పేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదిత్యకి కాల్ చేయడం తప్ప మరో దారి లేదనుకుంటాడు. మరోవైపు అప్పారావ్ నువ్వు హోటల్ కి వెళ్లు అని దీప చెప్పినా ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్లను అంటాడు. ఇంతలో కార్తీక్ ఇంటికి రావడంతో అప్పారావు ఎదురుగా వచ్చి హోటల్ యజమాని నాకు అంతా చెప్పాడు నిన్ను ఏదేదో అనేశాను నన్ను క్షమించు అంటాడు. వెళ్లిన పని అయిందా అని కన్నీళ్లతో అడిగిన దీపకి ఓ ట్యాబ్లెట్ ఇస్తాడు. అయితే శౌర్యకి పెద్ద ప్రమాదమే ఉంది ఈ ట్యాబ్లెట్ తాత్కాలికమే అనుకుని..ఆదిత్యకి కాల్ చేయడం తప్ప మరోదారి లేదనుకుంటాడు. 


Also Read: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
అప్పారావు దగ్గర్నుంచి ఫోన్ తీసుకున్న కార్తీక్..ఆదిత్యకి కాల్ చేస్తాడు ( ఆదిత్య ఫోన్ ని మోనిత కారుకింద తొక్కించేసింది కదా ఫోన్ లేదన్నమాట) స్విచ్చాఫ్ అని వస్తుంది. అంబులెన్స్ కి ఫోన్ చేసి శౌర్యని హాస్పటల్ కి తరలిస్తారు. డాక్టర్ సర్జరీలో ఉన్నారు..ముందు ఫార్మాలటీస్ పూర్తిచేయమని అక్కడి రిసెప్షనిస్ట్ అంటుంది. ఇది నిజంగా పెద్ద సమస్యే అని కార్తీక్ అనడంతో మీరు పెద్ద డాక్టర్ లా మాట్లాడుతున్నారేంటి అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రుద్రాణి..తన స్టైల్లో బెదిరింపులు మొదలెడుతుంది. పాత అప్పు మాఫీ చేస్తాను, ఇప్పుడు ఇస్తున్నది అప్పే అనుకోవద్దు, బదులుగా హిమని ఇమ్మని అడుగుతుంది. దీప రివర్సవడంతో రుద్రాణి అక్కడినుంచి వెళ్లిపోతుంది.


Also Read: శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీతో తాడికొండ ఎపిసోడ్ ముగుస్తుందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
శౌర్య కండిషన్ సీరియస్ గా ఉంది, స్టంట్ వేయాలి అని కార్తీక్ చెబుతుంటే ఆ డాక్టర్ ఏంటి పెద్ద డాక్టర్ లా మాట్లాడుతున్నావ్ అని కోప్పడతాడు. ముందు ఫార్మాలటీస్ పూర్తిచేశావా..అవన్నీ కాకుండా ఇలా మాట్లాడతావేంటని అనేసి వెళ్లిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన అప్పారావు ..హిమ కనిపించడం లేదని చెబుతాడు. ఇలాంటి సమయంలో డాక్టర్ తో గొడవ వద్దు.. వేరే హాస్పిటల్ కి తీసుకెళదాం అంటాడు. మరోవైపు హిమ..రుద్రాణి ఇంటికి వెళ్లి ఎప్పటికీ మీ దగ్గరే ఉండిపోతాను మా శౌర్య బావుంటే చాలు డబ్బులిచ్చి శౌర్యని కాపాడండి అని అడుగుతుంది. మురిసిపోయిన రుద్రాణి..హిమని చూసి నువ్వు మా అమ్మలాగే ఉంటావ్ అందుకే నువ్వంటే చాలా ఇష్టం.. నువ్వు నాముందు చేతులు కట్టుకోవద్దు నాతో ముద్దుగా మాట్లాడితే చాలంటుంది. ఇకపై ఆంటీ అని పిలవొద్దు అమ్మ అను చాలు అంటుంది. 


Also Read:  చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
ఏంటి ఆదిత్య నీ ఫోన్ పోయింది, నా ఫోన్ రిపేర్ కి ఇచ్చిన వాడు ఇవ్వలేదు..ఇలా జరిగిందేంటి అంటుంది శ్రావ్య. ఆ నంబర్ అన్నయ్య పేరుమీద ఉంది.. అంటే సేమ్ నంబర్ తీసుకోవడం కష్టం అంటుంది. అంత పెద్దఇంట్లో మనం ముగ్గురం ఉండటం నచ్చడం లేదు..మా అమ్మా నాన్నని రమ్మంటే రానన్నారని బాధపడుతుంది. ఈ వయసులో అమ్మా నాన్న వెళ్లడం ఏంటో, అన్నయ్య వదిన వెళ్లిపోయారు ఏంటిలా జరిగిందనుకుంటారు. కట్ చేస్తే హిమకి ఏం తినిపించినా తినకపోవడంతో రుద్రాణి ఏంటమ్మా అంటుంది. మా శౌర్యకి ఆరోగ్యం బాలేదని ఏడుస్తుంది. నువ్వు ఏడవకు ఏం కావాలన్నా ఇస్తాను, ఈ ఆస్తి మొత్తం నీదే..తాడికొండలో నిన్ను మరో రుద్రాణిలా తయారు చేస్తానంటుంది. ఇంతలో అక్కడకు దీప ఎంట్రీ ఇస్తుంది...


రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
ఇది చాలా క్రిటకిల్ సర్జరీ... డాక్టర్ కార్తీక్ తప్ప ఎవ్వరూ చేయలేరంటాడు అక్కడి డాక్టర్. స్పందించిన దీప..డాక్టర్ కార్తీ ఇంట్లో నేను నెల రోజులు వంటమనిషిగా పనిచేశాను ఆయన్ని పిలిపించుకుంటానంటుంది. దీప భర్త కార్తీక్ గా కాదు..శౌర్య తల్లి దీపగా అడుగుతుననా నా కూతుర్ని బతికించండి అని కార్తీక్ నికన్నీళ్లతో ప్రాధేయపడుతుంది దీప. మరి కార్తీక్ ఏం చేయబోతున్నాడో చూడాలి...


Also Read:  సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్