గుప్పెడంత మనసు జనవరి 28 శుక్రవారం ఎపిసోడ్


రిషితో పాటూ కలిసొచ్చిన జగతిని చూసి మహేంద్ర ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో అలాగే ఉండిపోతాడు. తండ్రి సంతోషాన్ని రిషి అలా చూస్తూండిపోతాడు. జగతి అని మంచంపైనుంచి లేస్తుండగా మహేంద్ర లేవొద్దని జగతి పరిగెత్తుకు వస్తుంది. రిషి ఏంటి సర్ ప్రైజ్ అని..ఏం మాట్లాడాలో తెలియక మహేంద్ర మాట్లాడలేకపోతాడు. ఈ సంతోషం మీ కళ్లలో చూడాలనే తీసుకొచ్చాను డాడ్ అనుకుని సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేసి రూమ్ లోంచి వెళ్లిపోతుంటాడు. రిషి అని పిలుస్తూ మహేంద్ర లేవబోతుండగా పక్కకి తూలిపడబోతుంటాడు.. డాడ్ అని రిషి వెనక్కు వెళ్లోలోగా జగతి పట్టుకోవడం చూసి రిషి వెనక్కి ఆగిపోతాడు. 


Also Read: శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీతో తాడికొండ ఎపిసోడ్ ముగుస్తుందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
ఇన్ని రోజులూ నేను రిషిని కాపాడుకుంటూ..జగతికి దూరంగా పెడుతూ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. జగతి నా ఇంట్లో అడుగుపెట్టడమేంటి, రిషి వెళ్లి తీసుకురావడం ఏంటి, ఈ దేవయాని జగతిపై ఓడిపోయిందా...లేదు..నేను ఓడిపోను అనుకుంటూ భర్త ఫణీంద్రకి కాల్ చేస్తుంది. ఎక్కడున్నారు, ఏంటసలు మీకసలు ఇంట్లో ఏం జరుగుతోందో తెలుస్తోందా, ఎటెళ్లారు ఇక్కడి పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి త్వరగా ఇంటికి రండి అని చెబుతుంది. ఇదేకదా గెస్ట్ రూమ్ రిషి ఈ రూమే గెస్టులకు ఇస్తానన్నాడు, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో అడుగుపెట్టేందుకే భయపడే జగతి.. నా ఇంట్లో గెస్ట్ గా ఉంటుందా.. నేను చూస్తూ ఊరుకుంటానా...చెప్పాల్సిన గుణపాఠం చెబుతాను, చెయ్యాల్సిందంతా చేస్తాను అనుకుంటూ డోర్ తీసి.. బయట ఉన్న రిషి-వసుధారని చూసి షాక్ అవుతుంది. 


Also Read: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
పెద్దమ్మ రూమ్ లో మీరున్నారా పక్కకు జరగండి రా వసుధార అని రిషి రూమ్ లోకి వెళతాడు. ఇంతలో దేవయాని బయటకు వెళుతూ సూట్ కేస్ కాలిపైకి తంతుంది. ఎవరికి వారే సొంత వైద్యం చేయాలని చూస్తుంటే ఎవ్వరూ సొంత వైద్యం చేయొద్దని చెప్పి డాక్టర్ ని పిలుస్తాడు రిషి. గౌతమ్ హడావుడి చేస్తుంటే రిషి కంట్రోల్ చేస్తుంటాడు. మరోవైపు దేవయానిని గమనిస్తున్న జగతికి డౌట్ వస్తుంది. దేవయాని వైపు చూస్తూ వసు ఇంత దెబ్బ ఎలా తగిలింది నీకు అని అడుగుతుంది. ఇంతలో డాక్టర్ కాలు స్వెల్లింగ్ వచ్చింది కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని చెబుతాడు. నేను ఇంటికి వెళతాను, అందరకీ పండుగ మూడ్ పోతుంది నేను ఇలాగే ఉంటే అని వసు అంటే.. మా ఇంట్లో నీకు దెబ్బతగిలింది అది తగ్గేవరకూ నువ్వు ఇక్కడే ఉండాలంటాడు రిషి. నువ్వు సూపర్ రా రిషి, ఇది ఎండీ ఆలోచన అంటే అని గౌతమ్ పొగిడేస్తాడు. దేవయాని మాత్రం కుళ్లుకుంటూ చూస్తుంటుంది.  


Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
వంటగదిలో ఉన్న ధరణితో..హ్యాపీ సంక్రాంతి వదినా అంటూ సంతోషంగా మాట్లాడతాడు. గెస్టులు వస్తే నాకు చాలా సంతోషం, కానీ వసుధార కాలికి దెబ్బతగలకుండా ఉండాల్సింది. ఈ సంక్రాంతి నాకు అన్నీ కలిసొస్తున్నాయ్, గాలిపటం గాల్లో ఎగురుతోందని గలగలా మాట్లాడుతుంటాడు. గాలిపటం దారి తెగుతుందని రిషి ఎంట్రీ ఇస్తాడు. ఆ తెంపేవాడివి నువ్వే అంటాడు గౌతమ్. తెంపడం కాదు ముడివేయడం నేర్చుకో అంటాడు. వసు కాలికి దెబ్బతగిలితే నా గుండె కరిగి నీరైపోయిందని గౌతమ్ అంటే.. ఏంకాదు చలికాలమే కదా గడ్డకడుతుందిలే అంటాడు రిషి. నేను ఇంట్లోనే ఉంటా ఏమాత్రం ఎక్కువ చేసినా తోక కట్ చేస్తా అంటాడు రిషి. వదినా మీరు ఎన్నాళ్లు కాఫీ మోస్తారు ఈ రోజు నుంచి నేను మీకు హెల్ప్ చేస్తానంటూ ట్రే తీసుకుంటాడు. అడ్డుకున్న రిషిని మిత్రదోహి అని తిడతాడు. వీళ్ల డిస్కషన్ మొత్తం విని ధరణి నవ్వుకుంటుంది. 


Also Read: తండ్రి సంతోషం కోసం ఓ మెట్టుదిగిన రిషి, గుండెల్ని మెలిపెట్టిన గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
రూమ్ లో కూర్చున్న వసుధార ఆ సూట్ కేస్ కాలికి ఎలా తగిలింది.. దెబ్బ తగిలిందనే బాధ కన్నా జగతి మేడం ఇంటికొచ్చారన్న ఆనందమే ఎక్కువ ఉంది.. రిషి సార్ రాగానే గట్టిగా పట్టుకుని థ్యాంక్యూ చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో రిషి రూమ్ లోకి వచ్చినట్టు ఊహించుకుని చేయిపట్టుకుని థ్యాంక్స్ చెప్పినట్టు ఆలోచనల్లో మునిగిపోతుంది. ఈసారి నిజంగానే రిషి కాఫీ తీసుకుని వస్తాడు. రెస్టారెంట్ లో నేను నీ గెస్ట్ ని కాఫీ ఇస్తావ్, ఇక్కడ నువ్వు నా గెస్ట్ వి అని కాఫీ ఇస్తాడు. కాలు బాగా నొప్పిగా ఉందా అంటే పర్వాలేదు అంటుంది. సారీ వసుధార మా ఇంటికి రాగానే ఇలా జరిగిందన్న రిషితో పర్వాలేదు సార్ అంటుంది. ఇక్కడ నీకేమీ ఇబ్బంది లేదుకదా అని రిషి అడిగితే..నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు..మీరిక్కడ ఎలాంటి ఇబ్బంది పడొద్దని చెబుతాడు.
మరోవైపు గౌతమ్, ధరణి, జగతి బయట కూర్చుని మాట్లాడుకుంటారు. రేపటి ముగ్గు నా వంతు అంటుంది జగతి. ఏం కావాలో చెప్పండి నేను తీసుకొస్తానంటాడు గౌతమ్. అటు వసుధార కూడా  కాలికి దెబ్బతగలకపోతే నేను ముగ్గు  వేసేదాన్ని అంటుంది. అవన్నీ వదిన చూసుకుంటుందిలే అన్న రిషి.. అటు ఇటు తిరిగి కాలునొప్పి పెంచుకోవద్దంటాడు. కొన్ని రంగులు అవసరం అవుతాయి తెప్పించండని చెబుతుంది.  ఎపిసోడ్ ముగిసింది...


Also Read: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి