ఊపిరిత్తిత్తుల క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స మొదలుపెట్టవచ్చు. ప్రాథమిక దశలో ఈ భయంకర రోగాన్ని గుర్తిస్తే చికిత్స కూడా ఆశావహంగా ఉంటుంది. లేకుండా ఊపిరితిత్తుల చుట్టూ క్యాన్సర్ కణాలు నియంత్రణ లేకుండా పెరుగూతూ ప్రాణానికే ముప్పు తెస్తాయి. ఈ క్యాన్సర్ ఉందో లేదో గుర్తించాలంటే ముందు దీని లక్షణాలు తెలియాలి. తాజా ఓ కొత్త లక్షణాన్ని కూడా వైద్యులు కనుగొన్నారు. అయితే ఈ లక్షణాన్ని తేలికగా తీసుకుంటారు చాలా మంది. కారణం అది చాలా సాధారణంగా కనిపిస్తుంది. దగ్గు రావడంతో పాటూ గొంతు వెనుక భాగంలో కితకితలు పెట్టినట్టు అనిపిస్తుంది. దీన్ని చాలా మంది పట్టించుకోరు. ఇది కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణమేనని చెబుతున్నారు వైద్యులు. అతిగా అలసటగా అనిపించినా, గొంతు మారినా (Change in the voice) కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏమోనని అనుమానించాలి. 


ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ?
ధూమపానం, పొగాకు కాల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఇవే కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1. దుమ్ము ధూళితో కూడా వాతావరణంలో పనిచస్తున్నవారు
2. ఆస్బెస్టాస్‌తో పనిచేస్తున్న వారు
3. కుటుంబంలో ఎవరికైనా ఉన్నా...
4. గాలి కాలుష్యానికి తీవ్రంగా గురవుతున్నవారు
5. డీజిల్ వాహనాల వల్ల వచ్చే పొగలు పీలుస్తున్నవారు
ఇంగ్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, కార్లు కొన్ని వాహనాల ద్వారా ఉత్పత్తి అయ్యే నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయిలు అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 33 శాతం పెరుగుతుంది. 


రాకుండా ఇలా జాగ్రత్త పడవచ్చు
ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందుగా ధూమపానం, పొగాకు మానివేయాలి. అలాగే మరికొన్ని జాగ్రత్తలు పాటించాలి.


1. పాసివ్ స్మోకింగ్ బారిన పడకూడదు. ఆ పొగ చాలా డేంజర్.
2. మీ ఇంటిలో రాడాన్ (రేడియోయాక్టివ్ గ్యాస్) స్థాయిలు ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి. 
3. వారంలో అయిదు రోజుల పాటూ వ్యాయామాలు చేయాలి.
4. విటమిన్ సి ఉన్న ఆహారాన్ని అధికంగా తినాలి. 
5. మీ ఛాతీకి రేడియేషన్ తగలకుండా చూసుకోవాలి. 
6. బ్రస్సెల్ స్పౌట్స్, బ్రకోలి, కాలీ ఫ్లవర్ వంటివి అధికంగా తినాలి. 
7. తరచూ ఊపిరితిత్తులను చెక్ చేయించుకోవాలి. 
8. వాయుకాలుష్యం బారిన పడకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. 
9. ఎన్95 వంటి మాస్కుల ధరిస్తే మంచిది. 




గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.