ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ సీజన్ 15 ముగిసిపోయింది. బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ స్టార్ అయిన తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ సీజన్ 15లో విజేతగా నిలిచింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ నుంచి వచ్చిన ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


సెలబ్రిటీల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. సీజన్ 13 కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ కూడా ఈ ఈవెంట్‌లో భాగం అయింది. దివంగత నటుడు, తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ శుక్లాను గుర్తు చేసుకుంటూ.. తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అతడికి షెహనాజ్ ట్రిబ్యూట్ ఇవ్వబోతుంది.


డాన్స్ పెర్ఫార్మన్స్ అనంతరం షెహనాజ్‌ను  సల్మాన్ ఖాన్ స్టేజ్ పైకి పిలిచారు. అప్పటివరకు బలంగానే ఉన్న షెహనాజ్.. సల్మాన్‌ను చూసి వెంటనే భావోద్వేగానికి లోనైంది. సల్మాన్ ఖాన్ కూడా తనను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత సిద్ధార్థ్‌ను గుర్తుచేసుకుంటూ సల్మాన్ కూడా స్టేజ్‌పై ఎమోషనల్ అయ్యారు. 


ప్రతీక్, నిశాంత్, షమితా, తేజస్వి, కరణ్, రాఖీ, రష్మి ఫైనల్‌కు చేరుకోగా.. వీరిలో ప్రతీక్ సెహజ్ పాల్, తేజస్వి ప్రకాష్ టాప్-2గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ నడుమ ను విజేతగా సల్మాన్ ఖాన్ ప్రకటించారు. బిగ్ బాస్ విజేతగా తన పేరును ప్రకటించగానే ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్టేజ్‌పై సంబరాల్లో మునిపోయారు.






'