గుప్పెడంతమనసు జనవరి 29 శనివారం ఎపిసోడ్


వసుధారకి కాఫీ తీసుకెళ్లిన రిషికి థ్యాంక్స్ చెబుతుంది. ఎందుకు అని అడిగితే ( జగతి మేడంని తీసుకొచ్చినందుకు అని మనసులో అనుకుని) కాఫీ తీసుకొచ్చినందుకు అని బయటకు చెబుతుంది. ఏం అవసరం అయినా నువ్వు నన్ను అడుగు అని చెప్పేసి వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర...నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు.  రిషి ముందే చెప్పి ఉంటే బాగుండేది.. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే నా కళ్లతో చూసేవాడ్ని.. ఈ ఇంట్లో నీ కాలు మోసి ఎన్నాళ్లైంది. సంక్రాంతి పండుగకి రిషి నాకు చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చాడంటాడు. మహేంద్రని కళ్లార్పకుండా చూస్తున్న జగతిని పిలవడంతో.. నన్ను మాట్లాడించవద్దు మహేంద్ర...ఇదంతా కలేమో ఎక్కడ మెలుకువ వస్తుందో అన్న భయంలో ఉన్నానంటుంది. ఇంతలో ధరణి వచ్చి.. మీకోసం ఏం చేయమంటారు అని అడుగుతుంది. ధరణి నా కడుపు, మనసు నిండిపోయింది ఏమీ వద్దు అంటుంది జగతి. మాటల మధ్యలో కల్పించుకున్న ధరణి...  ‘పెద్ద అత్తయ్యగారి కోపం చూస్తుంటే భయం వేస్తోంది.. ఇప్పుడే పెద మావయ్యగారు వచ్చారు’ అంటూ చెబుతుంది.  జగతి వచ్చిన ఆనందంలో వాళ్లు ఎన్ని మాటలు అన్నా భరించొచ్చులే ధరణీ.. మేము వచ్చి అన్నయ్యని కలుస్తాంలే’ అని ధరణిని పంపించి.. జగతితో పాటు మహేంద్ర కూడా కిందకి వెళ్తాడు.


Also Read: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ఇక వసు.. గౌతమ్, రిషిలతో.. ‘గొబ్బిళ్లు  లేనిదే ముగ్గుకి విలువ లేదు.. పండగకి విలువ లేదు’అంటూ ఆవు పేడ ఎవరు ముందు తెస్తారో వాళ్లకి నేను గిఫ్ట్ ఇస్తాను అంటుంది. దాంతో రిషి నేనెందుకు వెళ్లాలి అనుకుంటాడు. ఇంతలో గౌతమ్ నేను రెడీ అనడంతో రిషి కూడా తయారవుతాడు. ఇద్దరూ ఉంటే గెలిచిన వాళ్లకి గిఫ్ట్ ఇస్తాను, ఒకవేళ ఒక్కరే ఉంటే ఏ పోటీ లేకుండా గిఫ్ట్ ఆ ఒక్కరికే ఇస్తానంటుంది. గొబ్బెమ్మను పేడతోనే చేయాలా, గోధుమపిండితో చేయలేమా అన్న రిషికి..ఆవుపేడ గురించి క్లాస్ వేస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకున్నాను, నువ్వు జ్ఞానబోధ చేయొద్దు అంటాడు. ఆవుపేడ కోసం ఇద్దరూ సైకిల్స్ వేసుకుని బయలుదేరుతారు. 


Also Read: సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
మహేంద్ర, ఫణీంద్రలు హాల్లో కూర్చుని ఉంటారు. జగతి అటు, దేవయాని ఇటు నిలబడి ఉంటారు.  ‘ఏంటండీ ఏం మాట్లాడరు?’ అంటుంది దేవయాని రగిలిపోతూ.. ‘ఏంటి దేవయానీ? నీ బాధేంటీ?’ అంటాడు మహేంద్ర. ‘ఎప్పుడో తెంచుకున్న చుట్టరికం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అని అడుగుతున్నాను’ అంటుంది దేవయాని నిష్టూరంగా.. ‘ఎప్పుడు రాని దాన్ని ఇప్పుడు ఎందుకు వచ్చాను? మీకు చెప్పినా అర్థం కాదు లెండీ అక్కయ్యగారు.. అది మనసు ఉన్నవారికే అర్థమవుతుంది’ అంటుంది జగతి. ‘చూశారా చూశారా నా ఇంటికి వచ్చి నన్నే అంటోంది’ అంటుంది దేవయాని రగిలిపోతూ.. ‘వదినా జగతి తనంతట తాను ఇక్కడికి రమ్మన్నా రాదు..’ అంటాడు మహేంద్ర. ‘మరి ఎందుకొచ్చిందో’ అని దేవయాని వెటకారంగా అనడంతో.. ‘దీనికి సమాధానం రిషి చేత చెప్పిస్తాను’ అంటాడు మహేంద్ర. ‘ప్రతి దానికి మీకు రిషి అమాయకంగా దొరుకుతాడు లెండీ.. అసలు జగతిని కాలేజ్‌లోకి తెచ్చింది నువ్వు కదా మహేంద్రా’ అంటుంది . ‘దేవయానీ ఇప్పుడు కాలేజ్ విషయాలు ఎందుకు’ అంటాడు ఫణీంద్ర. ‘ఇదే అందరకీ అలుసైపోయింది..ప్రతి దానికీ నా నోరు మూయిస్తున్నారు, ఏదైనా అంటే మిషన్ ఎడ్యుకేషన్ అంటారు, నెత్తికి ఎక్కించుకుంటారు..’ అంటూ ఫైర్ అవుతుంది.


Also Read:  సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
‘దేవయానీ అసలు నీ బాధేంటో ఇన్నేళ్లు అయినా నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎప్పుడో ఏదో జరిగిందని ఆ బరువుని ఇంకా మోస్తున్నావా.. నీ ఇల్లు నీ ఇల్లు అంటున్నావ్.. ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో జగతికి కూడా అంతే హక్కు ఉంటుంది’అంటాడు ఫణీంద్ర. అనుకుంటూనే ఉన్నాను.. హక్కులు వాటాలు అడగకముందే మీరే ఐడియాలు ఇవ్వండి అంటుంది దేవయాని. ‘అక్కయ్యగారు.. నేను హక్కులకోసం పంతానికి వెళ్తే మీకే అవమానం జరుగుతుంది.. వాటాలకు పోరాడితే మీ పెత్తనం ప్రశ్నార్థకం అవుతుంది.. రిషి మనసు కష్టపెట్టకూడదనే ఒకే ఒక్క విషయంలో మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా సహిస్తున్నాను’అంటుంది జగతి. ‘అదండీ సంగతి.. వింటున్నారా’ అంటుంది దేవయాని. ‘దేవయానీ ఏంటీ గొడవ.. రిషికి తెలిస్తే ఏం అనుకుంటాడు. మహేంద్రకు బాలేదు..అది కూడా ఆలోచించవా నువ్వు’అంటాడు ఫణేంద్ర. మీరెప్పుడూ పరాయివాళ్లకే వంతపాడతారు అన్న దేవయానితో... ‘వదినా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు.. ఇక్కడ ఎవ్వరూ పరాయి వాళ్లు లేరు.. జగతి నా భార్య..’ అంటాడు మహేంద్ర కోపంగా.. ‘కానివ్వండి అంతా ఒకటి అయ్యారు’ అంటూ దేవయాని అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది. 


Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
కాస్త ముందుకు వెళ్లిన దేవయాని వెనక్కి తిరిగి జగతినే చూస్తూ.. ‘జగతి రిషి తీసుకుని వచ్చాడని సంబరపడకు.. ఈ సారి రిషి కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు.. చెబుతాను నీ సంగతి’ అంటూ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. జగతి ఎమోషనల్ అవుతూ ఉండగా.. ఫణీంద్ర, మహేంద్ర పైకి లేస్తారు. జగతీ.. అంటూ మహేంద్ర ఓదారుస్తుంటే.. ‘ఊరుకోమ్మా రాకరాక ఇంటికి వచ్చావ్ కన్నీళ్లు పెట్టుకోవద్దు’ అంటూ నచ్చజెబుతాడు ఫణీంద్ర.  న్ కట్ చేస్తే  దేవయాని తనలో తనే రగిలిపోతూ హాల్లో కూర్చుంటుంది. ఏంటి దేవయాని ఒంటరిగా కూర్చున్నావ్.. మహేంద్ర కోసమైనా నాలుగు రోజులు నవ్వుతూ ఉండొచ్చుగా అంటాడు ఫణీంద్ర. నా వల్ల కాదు అంటుంది దేవయాని. ఇంతలో ధరణి వచ్చి.. ఫణీంద్ర చేతిలో బ్యాగ్స్ అందుకుంటుంది. ‘ఏంటండీ..అవి’ అంటుంది దేవయాని. ‘జగతి మహేంద్రకు బట్టలు తెచ్చాను దేవయాని.. మన చేతులతో వాళ్లకి ఇస్తే బాగుంటుంది’ అంటాడు.  దేవయాని ఆవేశంతో ఊగిపోతుంది. ధరణి కమ్మగా వండి పెడుతుంది. మీరేమో బట్టలు పెట్టండి.. అయినా ఆ జగతిని నా చేతులతో బట్టలు పెట్టను’ అంటూ అక్కడ నుంచి వెళ్లబోతుంటే.. మహేంద్ర, జగతి అప్పుడే వస్తారు. వాళ్లని చూడగానే.. ‘రండి మహేంద్రా రా అమ్మా జగతి’ అని ఫణీంద్ర కవర్ చేసి దేవయానిని ఇరికిస్తాడు. సరిగ్గా అప్పుడే రిషి పై నుంచి కిందకు దిగడంతో.. ‘దేవుడా ఈ టైమ్‌లో రిషి వస్తున్నాడేంటీ?’ అని తనలో తనే అనుకుంటుంది అయిష్టంగా.. 


రేపటి ఎపిసోడ్ లో 
కమింగ్ అప్‌లో.. భోగి మంట ముందు డాన్స్ చేస్తారు అంతా. అప్పుడు కూడా జగతి, మహేంద్రల మధ్యకు వచ్చి విడగొట్టి నిలబడుతుంది దేవయాని. ఏం మహేంద్ర నువ్వు పేషెంట్ వి అన్న విషయం మరిచిపోయినట్టున్నావ్ అంటుంది.  కాసేపటికి ఫణీంద్ర.. ‘రిషి ఆ స్టోర్ రూమ్‌లో ఉన్న పాత వస్తువులు తెచ్చి ఇందులో వేసెయ్’ అంటాడు. దాంతో రిషి సరే పెదనాన్నా అని వెళ్తుంటే.. ‘సార్ నేను రావచ్చా’ అంటుంది వసు. సరేరా అని వసుని తీసుకుని స్టోర్ రూమ్‌కి వెళ్తాడు రిషి. అక్కడ ఓ చెక్క పట్టుకోవడంతో వేలికి గుచ్చుకుంటుంది. రిషి బాధపడిపోతుంటాడు.. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ చీకటిగా ఉంది ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు....


Also Read: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్