Gold Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్‌లో రూ.350 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,250కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.1,400 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,300 అయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారంపై రూ.390 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,250 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,150 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.66,300కు పతనమైంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు క్షీణించాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు క్షీణించాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,300 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150 గా ఉంది. ముంబయిలో రూ.350 మేర తగ్గడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,250 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గడంతో తులం ధర రూ.45,490 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,630కు పతనమైంది.
ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.24,720 అయింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్లాటినం ధర రూ.71 మేర తగ్గగా.. అక్కడ తులం ధర రూ.23,990కి పతనమైంది. హైదరాబాద్‌లో, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,720 వద్ద నిలకడగా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్ హల్వా లేదండోయ్! మారుతున్న సంప్రదాయాలు!!
Also Read: NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!