బిగ్ బాస్ ఫేం హిమజ తన భర్తకు విడాకులు ఇచ్చిందని రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిమజ ఈ వార్తలను ఖండించింది. ఈ వ్యాఖ్యలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా సమాధానం ఇచ్చింది. తనకు యూట్యూబ్‌లోనే పెళ్లి చేస్తున్నారని, యూట్యూబ్‌లోనే విడాకులు ఇస్తున్నారని తెలిపింది.


తాను ఇలాంటివి పట్టించుకోనని, కానీ తన తల్లిదండ్రులకు ఇలాంటి వార్తలు బాధ కలిగిస్తాయని వారి కోసం ఈ వీడియో చేసినట్లు తెలిపింది. తను పెళ్లి చేసుకుంటే చాలా గ్రాండ్‌గా చేసుకుంటానని, కానీ అది ఇప్పుడే కాదని పేర్కొంది. మరో 4-5 సంవత్సరాల వరకు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదంది. ఎవరో డబ్బులిచ్చి ఇలా చేయిస్తున్నారని కూడా హిమజ తన వీడియోలో తెలిపింది.


నేను శైలజ, ధృవ, మహానుభావుడు, ఉన్నది ఒక్కటే జిందగీ, వినయ విధేయ రామ, చిత్ర లహరి, వరుడు కావలెను చిత్రాల్లో హిమజ నటించింది. 2019లో జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-3 ద్వారా తను ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర అయింది. హిమజపై గతంలో కూడా ఇటువంటి రూమర్లు ఎన్నో వచ్చాయి. తనకు ఇప్పటికే పెళ్లయిందని ఎన్ని సార్లు వార్తలు వచ్చినా.. తను వాటిని ఖండిస్తుంది.