గుప్పెడంతమనసు ఫిబ్రవరి 1 మంగళవారం ఎపిసోడ్


భోగి మంటల్లో పాతచెక్కలు తీసుకొచ్చేందుకు స్టోర్ రూమ్ కి వెళ్లిన వసుధార చేతికి పేడు గుచ్చుకుంటుంది. అది చూసి రిషి బాధపడిపోతుంటాడు. వేలి లోపలకు దిగిందన్న వసు మీ దగ్గర పిన్నీసు ఉందా అని అడుగుతుంది. నా దగ్గర పిన్నీసు ఎందుకు ఉంటుందని రిప్లై ఇస్తాడు రిషి. పోనీ గుండు సూది ఉందా అంటే నేనేమైనా స్టేషనరీ షాపులా కనిపిస్తున్నానా అని సెటైర్ వేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పిన రిషి..ముల్లుని నోటితో తీసేందుకు ట్రై చేస్తాడు ( కంటిపాప సాంగ్ ప్లే అవుతుంది బ్యాంగ్రౌండ్ లో).ఇంత చిన్న ముల్లు నిన్న అంత ఇబ్బంది పెట్టింది అన్న రిషితో.. సమస్యలు కూడా అంతే చిన్న చిన్నవే ఎక్కువ ఇబ్బంది పెడతాయి అంటుంది. వీళ్లని వెతుకుతున్న గౌతమ్ అప్పుడే అక్కడకు వచ్చి నన్ను కూడా పిలవొచ్చు కదా చీకటి గదిలో ఇక్కడేం చేస్తున్నారని అడుగుతాడు. ఏం లేదురా కరెక్ట్ టైకి వచ్చావ్ ఆ చెక్కలు తీసుకుని నువ్వు వచ్చేసెయ్..మేం వెళుతున్నాం అంటాడు రిషి. వసు ముందు పరువు పోతుందని ఆలోచించి గౌతమ్ ఓ యోధుడు, వీరుడు అంటాడు. ఇప్పుడివనన్నీ మోసుకెళ్లాలా అనుకుంటాడు గౌతమ్. 


Also Read:  శౌర్య బతకాలంటే డాక్టర్ కార్తీక్ రావాలన్న మరో డాక్టర్, రప్పిస్తా అన్న వంటలక్క.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
ఏం ధరణి పార్టీ మార్చినట్టున్నావ్... భోగి మంటలు ఆరిపోగానే బొగ్గుల్ని, బూడిదని ఊడ్చేస్తాం.. కొందరు మనుషుల్లా ఏదీ శాశ్వతం అనుకోకు, నేను వాకిలి లాంటిదానని ఎప్పుడూ ఇక్కడే ఉంటాను గుర్తుపెట్టుకో ఇటు రా అని ధరణికి వార్నింగ్ ఇస్తుంది దేవయాని. గౌతమ్ నువ్వు మంచి పనిచేస్తున్నావ్ అన్న ఫణీంద్రతో థ్యాంక్యూ అంకుల్ అంటాడు. సైకిల్ పోటీలేవో జరిగాయంట కదా ఎవరు గెలిచారని అడుగుతాడు మహేంద్ర. వసు ఏదో చెప్పబోతుంటే నువ్వుండు వసుధార నేను చెబుతానంటూ మధ్యలోకి వచ్చిన గౌతమ్.. గెలిచామా, ఓడామా కాదు పోరాడామా లేదా అన్నది ముఖ్యం అని రిప్లై ఇస్తాడు. అర్థమైంది గౌతమ్ అని మహేంద్ర అంటే రిషి మురిసిపోతాడు. గతంలో వసుతో కలసి వనభోజనాల నుంచి వస్తున్నప్పుడు కారు చెడిపోవడంతో ఓ మంట దగ్గర డాన్స్ చేసిన విషయం గుర్తుచేసుకుంటాడు రిషి. అదే విషయం వసుకి గుర్తుచేసిన రిషి ఆ పాట గుర్తుందా అంటే.. ఫోన్లో రికార్డ్ చేశానని చెప్పి ఆ సాంగ్ ప్లే చేస్తుంది. మహేంద్ర డాన్స్ చేస్తాడు. 


Also Read: చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
ఆతర్వాత ఇంటి ద్వారాలకి పూలమాలలు కడుతుంటారు. వసు కూర్చుని అందిస్తుంటే రిషి పైన కడుతుంటాడు. పూలు సరిచేస్తుండగా రిషి చేతిలోంచి మాల జారి వసు మెడలో పడుతుంది.  అటు మావిడాకులు కడుతున్న జగతిని చూసి సంక్రాంతి లక్ష్మి ఇంటికి నడిచొచ్చినట్టుంది అంటాడు మహేంద్ర. మరోవైపు పూలు చల్లి వసుకి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాను నాకు కొంచెం కోపపేట్ చేయండని ధరణిని అడుగుతాడు గౌతమ్. ఎందుకులే రిషి ఫీలవుతాడు అంటే..నేను తర్వాత సారీ చెబుతాలే అంటాడు. ఆ పూల పళ్లెం తీసుకెళుతుండగా దేవయాని చూసుకోకుండా వచ్చి తోలేస్తుంది. ఆపూలు మహేంద్ర-జగతిపై పడతాయి..ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటూ ఉండిపోతారు.. దేవయాని మినహా అంతా సంతోషిస్తారు. ఎవరిపని ఇది అని మహేంద్ర అడిగితే.. మీ వదిన తెలియకుండానే మీపై పూల వర్షం కురిపించింది అంటాడు ఫణీంద్ర. థ్యాంక్యూ వదినా అని చెప్పిన మహేంద్ర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాడు. అంతా హ్యాపీ సంక్రాంతి చెప్పుకుంటారు. 


Also Read: సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
జగతిని ఏడిపించాలనుకున్న దేవయాని.. దగ్గరకు వెళ్లి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి నా రిషి ఆనందమే నాకు పండుగ అంటుంది. నన్ను ఆశీర్వదించండని కాళ్లకు నమస్కారం చేస్తాడు. జగతి ఇదంతా చూసి మనసులోనే బాధపడుతుంది. వసుకి షేక్ హ్యాండ్ ఇచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే వసు మాత్రం నమస్కారం చేసి హ్యాపీ సంక్రాంతి అని చెబుతుంది. అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. స్వీట్ తీసుకొచ్చిన జగతి సంతోషంగా రిషికి ఇస్తుంది. అది చూసిన దేవయాని తట్టుకోలేక ధరణిపై ఫైర్ అవుతుంది. మహేంద్ర పక్కన కూర్చున్న జగతిని ఆపేందుకు దేవయాని ట్రై చేస్తుంటే.. పెద్దవారు మీ  పక్కన ఎందుకు లెండి అని కౌంటర్ ఇచ్చి మహేంద్ర పక్కన కూర్చుంటుంది జగతి. ధరణి నువ్వు కూడా కూర్చో అంటే పర్వాలేదు అంటుంది. పాయసం చాలా బావుందని అంతా మెచ్చుకుంటే..జగతి నువ్వు చేశావ్ కదా అంటాడు మహేంద్ర. జగతి హ్యాపీగా ఫీలవుతుంది..


రేపటి (బుధవారం) ఎపిసోడ్
ఇంటి ముందు జగతి ముగ్గు వేస్తుంటే వసు అక్కడ కూర్చుంటుంది. ఓణవేసుకున్న వసుని చూసి అచ్చమైన తెలుగమ్మాయిలా ఉన్నావంటాడు రిషి. అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్ అదేమాట చెబుతాడు. ఇప్పుడే ఈ మాట రిషి చెప్పారని అంటుంది... ట్యాబ్లెట్ వేసుకునే టైమ్ అయిందని గౌతమ్ అంటే...ఇప్పుడే రిషి సార్ తెచ్చిచ్చారంటుంది. వీడు నాకు పోటీగాతయారయ్యాడా అనుకుంటాడు గౌతమ్. మరోవైపు రిషి కోసం జగతి కొత్తబట్టలు తీసుకుని వసు చేతికి ఇస్తుంది..ఇదంతా చూసిన దేవయాని కొడుక్కి కొత్తబట్టలు పెడుతున్నావా..దాంతోనే నీ కథకి ముగింపు ఇస్తానంటుంది. 


Also Read: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్