బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పెద్ద మొండిఘటం. తను అనుకున్నది కచ్చితంగా చేసి తీరుతుంది. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, అంతకు పదిరెట్లు ఘాటుగా సమాధానం చెప్తుంది.  తాజాగా కంగనా రనౌత్ నిర్మాతగా మారింది. ప్రొడ్యూసర్ గా ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘టిక్ వెడ్స్ షేరూ’. ఈ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.


కంగనా డ్రెస్సింగ్ సెన్స్ పై సభ్యా విమర్శలు


‘టిక్ వెడ్స్ షేరూ’ సక్సెస్ ను కంగనా బాగా సెలబ్రేట్ చేసింది. ఈ చిత్రబృందానికి మంచి పార్టీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించిన హాజరైన ఆమె.. లైట్ మేకప్, పోనిటేల్‌తో అందంగా కనిపించింది. ఈ ఫోటోలు, నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి. అందరూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ను ప్రశంసించారు. కానీ,  సోషల్ మీడియా ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ డైట్ సభ్యా, కంగనా అవుట్‌ ఫిట్‌ను విమర్శించింది. తనకు ఆమె వేసుకున్న డ్రెస్ అసలు నచ్చలేని చెప్పుకొచ్చింది. ఆమెకు అస్సలు ఫ్యాషన్ సెన్స్ లేదు అనే రీతిలో మాట్లాడింది.


దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా


తన అవుట్‌ ఫిట్‌ పై తీవ్ర విమర్శలు చేసిన సభ్యాపై సోషల్ మీడియా వేదికగా కంగనా స్పందించారు. తనను ఎగతాళి  చేస్తూ ఆమె పెట్టిన  పోస్ట్ స్క్రీన్‌ షాట్‌ ను షేర్ చేస్తూ, తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎలా ప్రోత్సహించాలనుకుంటుందో వివరించారు.“నేను ఫ్యాషన్‌ను ద్వేషిస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు. నేను పడుకునేటప్పుడు కూడా ఫ్యాషన్‌ గా ఉంటాను. కానీ, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నాను.  మనం సంపాదించే చోటే ఖర్చు చేయాలి. నేను ధరించిన దుస్తులు  భారతదేశంలో తయారు చేయబడినవి అని సగర్వంగా చెప్పగలను.  ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్నామని చెప్పడానికి నా దుస్తులే నిదర్శనం” అంటూ కంగనా సమాధానం చెప్పారు.   


'ఎమర్జెన్సీ'పై దేశ వ్యాప్తంగా ఆసక్తి


ఇక కంగనా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చివరిసారిగా 'ధకడ్'లో కనిపించిన కంగనా రనౌత్, ప్రస్తుతం 'తేజస్',  'ఎమర్జెన్సీ' లాంటి సినిమాల్లో నటిస్తోంది. ‘ఎమర్జెన్సీ’ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను ఇందులో చూపించారు.  ఈ చిత్రాన్ని మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి తో కలిసి కంగనా రనౌత్ నిర్మించారు. ఈ సినిమాలో జెపిగా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, పుపుల్ జైకర్‌గా మహిమా చౌదరి, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షాగా మిలింద్ సోమన్, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్,  జగ్జీవన్ రామ్‌గా సతీస్ కౌశిక్ నటించారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 






Read Also: నటి జాక్వెలిన్ కొత్త బంగళా చూశారా? రూ.12 కోట్లంటే ఆ మాత్రం ఉంటుంది మరీ!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial