బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎలా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఒక్కోసారి ఆమె చేసే వ్యాఖ్యలు బీ టౌన్ లో చర్చనీయాంశం అవుతూ ఉంటాయి కూడా. ఇటీవలే బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ తో సోషల్ మీడియాలో వార్ నడిచింది. అది జరిగి కొన్ని రోజులు గడవక ముందే మరో వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశం అవుతోంది కంగనా. తనపై ఎవరో నిఘా పెట్టారని, తన ప్రతి కదలికను అనుసరిస్తున్నారని ఆరోపించింది. దీనిపై పెద్ద నోట్ రాసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. 


నా పై నిఘా పెట్టారు : కంగనా రనౌత్ 


తనపై నిఘా పెట్టారని కంగనా రనౌత్ ఆరోపించింది. తన ప్రతి కదలికను గమనించడమే కాకుండా తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగలిస్తున్నారని మండిపడింది. ‘‘ఈ మధ్య కాలంలో సెలబ్రెటీల జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఎక్కడికి వెళ్లినా చాలా మంది నన్ను అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య తన పార్కింగ్ ఏరియా, అలాగే తన ఇంటి బాల్కనీలో కూడా కెమెరాలు జూమ్ అవుతున్నాయి’’ అని పేర్కొంది. ఇవన్నీ ఒకప్పుడు తనను ఇబ్బంది పెట్టిన ఓ సెలబ్రెటీ చేస్తున్నాడని ఆరోపించింది. తన డైలీ షెడ్యూల్ పనులే కాకుండా తన వ్యక్తిగత వివరాలను కూడా సేకరిస్తున్నారని అంది. తన వాట్సాప్ డేటా, వ్యక్తిగత వివరాలు, వ్యాపార ఒప్పందాలు కూడా లీక్ అవుతున్నాయని అంటూ రాసుకొచ్చింది.  అంతే కాదు తన వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎక్కువ జీతాలతో పిలిపించుకుంటున్నారని మండిపడింది. దీనంతటకీ ఆయన భార్య కూడా సపోర్ట్ చేస్తుందని ఆరోపించింది. అవన్నీ బయటకు రావడం తనకు ఎంతో ఆందోళన గా ఉందని పేర్కొంది. అయితే ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు బీ టౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. 


రణబీర్ కపూర్ - అలియా భట్ గురించేనా ?


కంగనా చేసిన వ్యాఖ్యల్లో పేర్లు గురించి ప్రస్తావన చేయకపోయినా అదంతా రణబీర్ కపూర్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ మిస్టరీ మ్యాన్ రణ‌బీర్ కపూరే కావచ్చని అంటున్నారు. కంగనా రనౌత్ తన సోదరుడి పెళ్లికి ధరించిన దుస్తులు లాంటివే అలియా తన పెళ్లికి కూడా ధరించింది. అప్పట్లో అది చర్చనీయాంశం అయింది. అలాగే రణబీర్ కపూర్, అలియా భట్ కూడా వేరు వేరు ఫ్లాట్ లలో నివశిస్తున్నారు. 


Also Read : పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్


కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తోంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. అలాగే రజనీ కాంత్ ‘చంద్రముఖి 2’ సినిమాలో కూడా కంగనా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల తర్వాత ‘తేజస్’ సినిమాలో కూడా నటించనుంది. ఇందులో ఆమె పైలట్ పాత్రలో నటించనుంది.