28 april day speciality in Tollywood : తెలుగు చిత్రసీమలో ఏప్రిల్ 28కి ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే... భారతీయ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన 'బాహుబలి 2' విడుదలైనది ఆ రోజే. అంతే కాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' విడుదలైనదీ ఆ రోజే. కొన్నేళ్ళ ముందుకు వెళితే... నందమూరి తారక రామారావు 'అడవి రాముడు'తో ఆంధ్రులను ఆలరించినదీ ఆ రోజే.
ఏప్రిల్ 28న విడుదలైన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ బరిలో చరిత్ర సృష్టించాయి. భారీ అంటే భారీ విజయాలు నమోదు చేశాయి. ఇప్పుడు ఆ తేదీ మీద అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కర్చీఫ్ వేశారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'ఏజెంట్' (Agent Movie Release Date). ఏప్రిల్ 28న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు.
'ఏజెంట్' మూవీ రిజల్ట్ ఎలా ఉంటుంది? ప్రభాస్ 'బాహుబలి 2', మహేష్ 'పోకిరి' మేజిక్ రిపీట్ అవుతుందా? ఇండస్ట్రీ హిట్ డేట్ మీద కన్నేసిన అఖిల్, ఎటువంటి రిజల్ట్ అందుకోబోతున్నారు? అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే... అక్కినేని కుటుంబంలో మూడో తరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, ఇప్పటి వరకు సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకోలేదు.
అఖిల్ అక్కినేని అందగాడు. కమర్షియల్ కథానాయకుడిగా కావాల్సిన కటౌట్ ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు 'సిసింద్రీ' చేసిన అనుభవం ఉంది. హీరోగానూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అమ్మాయిల్లో అతనికి ఫాలోయింగ్ ఉంది. 'హలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాలు ఓకే అనిపించుకున్నాయి. అయితే అఖిల్ గానీ, అక్కినేని ఫ్యామిలీ గానీ, అభిమానులు గానీ కోరుకున్న విజయాలు రాలేదని చెప్పాలి. అందువల్ల, 'ఏజెంట్' మీద ఆశలు పెట్టుకున్నారు.
'ఏజెంట్' అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్. పైగా, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తీస్తున్న సినిమా. ఆల్రెడీ విడుదలైన టీజర్లు చూస్తే... అఖిల్ ఎంతగా మేకోవర్ అయ్యారనేది తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందనేది కూడా తెలుస్తుంది. 'వైల్డ్ సాలా బోల్' అంటూ రిలీజ్ డేట్ టీజర్‌లో అఖిల్ బీస్ట్ మోడ్ చూపించారు. మరి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
దర్శకుడు సురేందర్ రెడ్డికి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అని పేరు ఉంది. మహేష్ బాబును 'అతిథి'లో గానీ, రామ్ చరణ్ ను 'ధ్రువ'లో గానీ చాలా బాగా చూపించారు. యాక్షన్ సీన్స్, సినిమాలు బాగా తీశారు. 'కిక్', 'రేసు గుర్రం' సినిమాల్లో అయితే కామెడీతో పాటు యాక్షన్ సీన్లు బాగా డీల్ చేశారు. 'సైరా నరసింహా రెడ్డి'తో పాన్ ఇండియా స్థాయిలో పరిచయమైన సురేందర్ రెడ్డి... 'ఏజెంట్'తో భారీ హిట్ అందుకోవాలని ప్రాణం పెట్టి తీస్తున్నారట.
Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా?
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న 'ఏజెంట్'లో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి సహ నిర్మాతలు.