ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివే ముందు... మీకు ఓ స్పాయిలర్ అలర్ట్! మీరు 'అవతార్ 2' సినిమా చూసేస్తే ఈ ఆర్టికల్ చదవండి. లేదంటే ఇక్కడితో ఆపేసి భారీ స్క్రీన్ మీద సినిమా చూసిన తర్వాత మళ్ళీ మా సైట్‌కు వచ్చి ఆర్టికల్ చదవండి. వాట్ అమ్మా? వాట్ ఈజ్ థిస్? ఎందుకు? అని క్వశ్చన్ చేసేవాళ్ళకు చెప్పబోయేది ఏంటంటే... సినిమాలో ముఖ్యమైన విషయం గురించి రాశాం కనుక!


మీకు 'అవతార్' కథ గుర్తు ఉందా? అందులో 'ఉనబటోనియం' అనే మెటల్ కోసం యుద్ధం జరిగింది. పండోరా గ్రహంపై ఆ ఖనిజం ఉందని మానవ జాతికి బాగా తెలుసు. అందుకని, పండోరాలో నివపిస్తున్న నావి జాతి ప్రజలను ఖాళీ చేయించి ఉనబటోనియం మైనింగ్ చేసి భూమిపైన అమ్ముకుంటే మిలియన్ డాలర్లు సంపాదించవచ్చనే ఆలోచనతో RDA అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఆ కథ ముఖ్య ఉద్దేశం కూడా అదే. 


'అవతార్ 2'కు వద్దాం! ఇందులో కూడా మానవ జాతి ఉంది. నావి జాతి ఉంది. పండోరా గ్రహం మీద మరో జాతిని కూడా పరిచయం చేశారు. వాళ్ళు అచ్చం చూడటానికి నావి జాతిలా ఉన్నప్పటికీ... కొంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు పార్ట్ 2 స్టోరీ విషయానికి వస్తే... నావి జాతి 'స్కై పీపుల్' అని పిలుచుకునే మానవ జాతి మళ్లీ పండోరా గ్రహంపైకి వస్తుంది. అయితే... ఈసారి వచ్చింది ఉనబటోనియం కోసం కాదు. దాన్ని పక్కన పెట్టేసి... నీళ్లలో తిరిగే భారీ తిమింగలాల (సినిమాలో టుల్‌కున్ అని పేరు పెట్టారు) కోసం వస్తారు. 


తిమింగలాలు స్వతహాగా తెలివైనవి. అవి మనుషులతో కమ్యూనికేట్ కాగలవు. ఈల వేయగలవు. మ్యూజిక్ ను క్రియేట్ చేయగలవు. నావిగేషన్ సాయం లేకుండానే వేల మైళ్లు సముద్రంలో లోతుల్లో ప్రయాణించగలవు. ఇవన్నీ చేయగలుగుతున్నాయని అంటే కారణం తిమింగలాలకు ఉన్న మెదడులోని ప్రత్యేకతలే. 'అవతార్ 2'లో ఈ అంశంపై RDA పరిశోధనలు చేస్తుంది. మెట్ కాయినా అనే సముద్రపు తెగ నావి జాతి ప్రజలు తిమింగలాలను సొంత మనుషుల్లా చూస్తాయి. వాటిని స్పిర్చువల్ బ్రదర్స్, సిస్టర్స్‌గా భావిస్తాయి. 


టుల్‌కున్స్‌లోని మెదడులోని ఓ ద్రవ పదార్థం కారణంగా వాటికి అన్ని తెలివి ఉందని, నావి జాతితో కమ్యూనికేట్ కావడానికి కారణమని RDA భావిస్తుంది. ఆ పదార్థాన్ని మనుషులు కనుక తీసుకోగలిగితే నిత్య యవ్వనులుగా ఉంటారని కొంత మంది తిమింగలాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటిని చంపి ఆ మెదడులోని పదార్థాన్ని సేకరిస్తుంటారు. ఆ పదార్థం పేరే 'అమృత' అని చెబుతారు 'అవతార్ 2' సినిమాలో.


Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?
 
అమరులుగా మిగలటం కోసం దేవ దానవుల మధ్య అమృతం కోసం జరిగిన ఘర్షణను 'అవతార్ 2'లో తిమింగలాలకు జేమ్స్ కెమరూన్ ఆపాదించారా? అనేంత ఆశ్చర్యం కలిగేలా సినిమాలో ఈ లైన్... 'అమృతం' పేరు ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. 'అవతార్ 2'లో మరో ఇండియన్ టచ్... అప్పట్లో 'అవతార్' రాముడి కథ అని, నీల మేఘశ్యాముని రూపమే నావి జాతికి నీలం రంగు టచ్ ఇవ్వడానికి స్ఫూర్తి అని జేమ్స్ కామెరూన్ చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా అమృతం, యవ్వనం కాన్సెప్ట్ నే కేమరూన్ తీసుకున్నారు.


Also Read : 'అవతార్ 2'కు రెండు ఇంటర్వెల్స్