మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'విశ్వంభర' (Vishwambhara Movie). చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. మరి విడుదల తేదీ ఇంకా ఎందుకు అనౌన్స్ చేయడం లేదు? రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ ఎందుకు? అంటే... విజువల్ ఎఫెక్ట్స్ సంతృప్తి చెందేలా వచ్చే వరకు వెయిట్ చేయాలని దర్శక నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారట. ఖర్చు విషయంలో అసలు వెనకంజ వేయడం లేదని యూనిట్స్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. 

'విశ్వంభర' విజువల్ ఎఫెక్ట్స్ @ 75 కోట్లుChiranjeevi's Vishwambhara VFX Budget: అవును... 'విశ్వంభర' విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు గురించి మీరు చదివిన పై హెడ్డింగ్ నిజమే. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం అక్షరాల ‌డబ్భై ఐదు కోట్ల రూపాయలను విశ్వంభర నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని తెలిసింది.‌ 

'విశ్వంభర' విజువల్ ఎఫెక్ట్స్ గురించి కొన్ని రోజులుగా నెగిటివ్ వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఇప్పటికీ మూడు కంపెనీలు మారాయని ఒక టాక్. అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శక నిర్మాతలు రాజీ పడకుండా వేర్వేరు ఆప్షన్స్ కోసం చూస్తున్నారు.‌ ఇక ఇండియన్ కంపెనీలతో లాభం లేదని, ఫారిన్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు వర్క్ అప్పగించారట. ఇప్పుడు టోటల్ కాస్ట్ 75 కోట్ల రూపాయలు దాటిందని తెలిసింది. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంత ఖర్చు పెడుతున్నారంటే, మూవీ మేకింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్ ఇంకా ఎంత అయ్యుంటాయో ఊహించవచ్చు.

Also Read: డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్ - జ్యోతికను టార్గెట్ చేసిన సిమ్రాన్?

'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట మల్లిడి... రెండో సినిమాకు చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్నారు యువి క్రియేషన్స్ పతాకం మీద వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా... చంద్రబోస్ సాహిత్యం సమకూరుస్తున్నారు. చోటా కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. 

Also Readరాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి

'విశ్వంభర' సినిమాలో చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష కథానాయికగా యాక్ట్ చేస్తున్నారు. ఆషికా రంగనాథ్ మరొక హీరోయిన్. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్', అక్కినేని నాగార్జున 'నా సామి రంగ' సినిమాల తర్వాత తెలుగులో ఆవిడ నటిస్తున్న చిత్రం ఇది. సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేటి, కునాల్ కపూర్ తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వేసవి తర్వాత థియేటర్లలోకి రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.