‘‘సరే సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అయిపోతాయా ఏంటీ?’’ ఇది బాలయ్య డైలాగ్ కాదు. ప్రస్తుతం శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫ్రెర్నాండెజ్ మనసులో మాట. అసలే అవకాశాల్లేక ఖాళీగా ఉన్న ఈ భామ పరిస్థితి.. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా ఉంది. సుఖ పురుషుడు సుకేష్.. పెద్ద బ్లఫ్‌మాస్టర్ అని తెలిసి ఈ బ్యూటీకి దిమాక్ ఖరాబ్ అయ్యింది.  ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకి నిప్పు కావలన్నట్లుగా.. ఏం చేయాలో తోచక సమతం అవుతున్న జాక్వలిన్‌ను కలిసి.. మీ లవ్ స్టోరీతో వెబ్‌సీరిస్ చేస్తామని బాలీవుడ్ దర్శకనిర్మాతలు అడుగుతున్నారట. క్రెడిట్స్‌తోపాటు ఆమె నష్టాన్ని కూడా పూడ్చుతామని ఆఫర్స్ ఇస్తున్నారట. అదేంటీ.. ఆమె కథకు అంత సీన్ ఉందా అనుకుంటున్నారా? అయితే, మీరు జాక్వెలిన్ ఎలా అతడి వలలో చిక్కుకుందో తెలుసుకోవల్సిందే.  


ఇలా పడేశాడు..: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేకర్ వల్ల పాపం.. జాక్వెలిన్ కూడా చిక్కుల్లో పడింది. ఆమె తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలీదుగానీ.. ఇప్పుడు ఆ కేసులో ఆమె కూడా నిందితురాలే. చిన్న చేపలను పట్టుకుంటే ఏమోస్తది? పడితే తిమింగాలన్నే పట్టాలనే కాన్సెప్ట్‌తో స్కెచ్ గీసిన సుకేష్.. ఎంతో పగడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేసి బాలీవుడ్ భామలపై ప్రయోగించాడు. అందం ఉన్నా.. అందుకు తగిన తెలివితేటలు లేని హీరోయిన్ల కోసం అన్వేషిస్తున్న సమయంలో జాక్వెలిన్ అతడికి చిక్కింది. ఓ ఖరీదైన బహుమతులతో ఆమెను ఆకట్టుకున్నాడు. తనకు సెంట్రల్ గవర్నమెంట్‌లో చాలామంది తెలుసని నమ్మబలికాడు. అతడి లైఫ్‌స్టైల్ చూసి ఆమె కూడా నిజమే అనుకుంది. ముఖ్యంగా అతడి మాటతీరుకు ఆమె ఫిదా అయ్యింది. అమ్మాయిలు పొగడ్తలకు పడిపోతారని అతడికి బాగా తెలుసు. అందుకే అతడు జాక్వలిన్‌‌ను హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీతో పోల్చితూ సుపర్ ఉమెన్.. కాదు కాదు ఇండియన్ సూపర్ హీరో సినిమాలకు తగినట్లుగా సరిపోయే చక్కని ఫిగర్ నీవేనంటూ ఆమెను పడేశాడు. అంతేకాదు.. అతడే స్వయంగా రూ.500 కోట్లతో ఒమెన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పడంతో.. పాపం నమ్మేసింది. ఆ తర్వాత అతడి పాపంలో పార్టనరైపోయింది.


జైల్లో నుంచే భారీ స్కెచ్: ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత 2017లో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుకేష్.. ఆ పార్టీ రెండాకుల గుర్తును ఇప్పిస్తానంటూ టీటీవీ దినకరణ్‌తో రూ.50 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు సుకేష్, దినకరణ్‌లను అరెస్టు చేశారు. సుకేష్‌ను తీహార్ జైలుకు తరలించారు. అయితే, అక్కడ కూడా సుకేష్ ఖాళీగా లేడు. జైలు నుంచి ఫోన్లు చేస్తూ ర్యాన్‌బాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్‌ భార్య అథితి సింగ్‌కు కాల్ చేసి.. లా సెక్రటరీ అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. శివీందర్‌‌కు బెయిల్ ఇప్పిస్తానని, ఇందుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో భారీ మొత్తాన్ని సుకేష్‌కు సమర్పించింది. అయితే, తన భర్తకు బెయిల్ రాకపోవడంతో అథితి పోలీసులను ఆశ్రయిస్తే.. అసలు మోసం బయపడింది. అదే సమయంలో సుకేష్ జాక్వెలిన్‌తో పులిహోర కలిపాడు. ఓ కేంద్రమంత్రి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు. తాను సన్‌టీవీ ఓనర్ శేఖరరత్నా అని తెలిపాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం పెరిగింది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో అతడు ఇచ్చిన ఆఫర్స్‌ను కాదనలేకపోయింది. జైల్లో ఉన్నప్పుడే జాక్వలిన్, నోరా ఫతేహీతోపాటు సుమారు 12 హీరోయిన్లు, మోడైల్స్ అతడిని కలిశారని తెలిసింది. 


శ్రద్ధా కపూర్‌తోనూ పరిచయం?: ఈడీ విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి. తనకు ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్‌‌తో కూడా పరిచయాలు ఉన్నాయని సుకేష్ చెప్పాడట. ఆమె తనకు 2015 నుంచి తెలుసని, ఆమెకు ఎన్‌సీబీ కేసులో సాయం చేశానని చెప్పడని సమాచారం. అంతేగాక శిల్పశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్న్ వీడియోల కేసు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కూడా సాయం చేస్తున్నా అని చెప్పడట. ఇప్పటికే అతడు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫ‌తేల‌కు భారీ గిఫ్టులు ఇచ్చిన‌ట్టు అంగీకరించాడు. తనకు మరింత మంది బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, వారికి కూడా వివిధ రకాలుగా హెల్ప్ చేశానని చెప్పడట. అయితే, ఇవన్నీ అతడి స్టేట్‌మెంట్ మాత్రమే. ఇందులో వాస్తవాలేమిటనేది విచారణ తర్వాతే తేలుతుంది.అతడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా తేలాల్సి ఉంది. 


Also Read: ఓటీటీలో ‘బిగ్ బాస్-6’: బాలకృష్ణ హోస్టింగ్‌పై స్పందించిన నాగార్జున


మాటలే పెట్టుబడి.. క్రిమినల్ బ్రెయిన్‌‌తో కోట్లు గడించాడు: ‘‘కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’’ అనే డైలాగును బాగా ఫాలో అయ్యాడో ఏమో. బెంగళూరుకు చెందిన సుకేష్ తన క్రిమినల్ దిమాక్‌తో దునియా మొత్తం ఏలేయడానికి ముంబైలో అడుగుపెట్టాడు. 17 ఏళ్ల వయస్సులోనే  మోసాలు చేయడం మొదలుపెట్టాడు. డబ్బు ఉన్నవాళ్లే ఇతడి ప్రధాన టార్గెట్. చిల్లర పనులకు దూరంగా ఉంటే.. బడాబాబులకు దగ్గరగా ఉంటూ.. మోసాలతో కోట్లు గడించాడు. జైల్లో కూర్చొని దాదాపు 200 కోట్లను ఫోన్ కాల్స్ ద్వారా సంపాదించడంటే.. అతడు ఎలాంటోడో అర్ధమైపోతుంది. సాదారణంగా ఇలాంటి క్యారెక్టర్‌లు పూరీ జగన్నాథ్ సినిమాల్లోనే ఉంటాయి. ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాలో మహేష్ బాబు తరహాలో సుకేష్ కూడా నేర ప్రపంచంలో ఎదిగాడు. విలాశవంతమైన జీవితం గడుపుతూ.. బాలీవుడ్ బామలతో స్నేహం చేశాడు. సుకేష్ తండ్రి బెంగళూరులో రబ్బర్ కాంట్రాక్టర్. 10వ తరగతి వరకే చదివాడు. ఆ తర్వాత మోసాలు చేస్తూ డబ్బు సంపాదించేందుకు అలవాటుపడ్డాడు. తనకు ఫలానా అధికారులు తెలుసంటూ ప్రజలను మభ్యపెట్టడం, వారి నుంచి డబ్బులు తీసుకోవడం ఆ తర్వాత మాయమవ్వడం.. ఇదీ సుకేష్ క్రైమ్ ఫార్మాట్. 2007లో తాను కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడినని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.1.14 కోట్ల వసూలు చేశాడు. ఆ సొమ్ముతో ఓ ఇల్లు, నాలుగు ఖరీదైన కార్లు, ఆరు సెల్‌ఫోన్‌లు, 12 వాచ్‌లు, 50 ఇంచ్ ఎల్‌సీడీ టీవీ, నగలు కొనుగోలు చేశాడు. అతడి విలాసాలు చూసి.. నిజంగానే అతడికి పెద్దలతో సంబంధాలు ఉన్నాయని అంతా నమ్మేశారు. అదే.. అతడి మోసాలకు పెట్టుబడిగా మారింది. 


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి