కీర్తి సురేశ్ అనగానే మహానటికి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాలి. అప్పటి వరకూ సినిమాలో హీరోయిన్ ఉందంటే ఉందిలే అనే పాత్రలు చేసిన కీర్తి...మహానటితో అందరు మెచ్చే హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు తనకంటూ ప్రత్యేకత ఉన్న ఏ క్యారెక్టర్ కి అయినా సై అంటోంది. అయితే అమ్మడి చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఓ లెక్క...మెగా ప్రాజెక్టులు మరో లెక్క అన్నట్టు మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో 'అజ్ఞాతవాసి'లో ఆడిపాడిన కీర్తి...చిరంజీవి -మెహర్ రమేష్ 'భోళా శంకర్' లో చిరుకి చెల్లెలిగా నటిస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే  అల్లు అర్జున్ తదుపరి మూవీలో కీర్తి సురేష్ ఫైనల్ కానుందని టాక్.
Also Read: నాగ పూజ మూఢనమ్మకమా- సర్పాలు, నాగులు, పాములు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి, వేటిని పూజించాలి
ఇప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప' పార్ట్ 1 చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. వచ్చే నెలలో సినిమా విడుదల కావాల్సి ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్దం చేయబోతున్నారు. వెంటనే పార్ట్ 2ను మొదలు పెట్టకుండా మధ్యలో ఓ సినిమా చేయబోతున్నాట బన్నీ. సరైనోడుతో సూపర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్. వచ్చే రెండు మూడు నెలల్లోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుందని కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం బాలయ్యతో 'అఖండ' మూవీతో బిజీగా ఉన్న బోయపాటి ఈ హడావుడి పూర్తైన వెంటనే బన్నీతో మూవీపై కాన్సన్ ట్రేట్ చేయనున్నాడట. వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ కూడా ఉందని టాక్. బోయపాటితో ఇప్పటికే సరైనోడులో నటించిన బన్నీ... అప్పటి వరకు తన కెరీర్లో ఉన్న సినిమాల రికార్డులను బద్దలు కొట్టాడు. మళ్లీ సేమ్ కాంబినేషన్ అంటే అఫీషియల్ ప్రకటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.  అల్లు అర్జున్- కీర్తి సురేష్ కాంబో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నారు. 
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి