'ఉప్పెన'తో కథానాయకుడిగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతో భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'కొండపొలం' చేసిన వైష్ణవ్, మరో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు. ఇదీ ప్రేమకథే కావడం విశేషం.
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) కథానాయకుడిగా గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga) టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్స్ మధ్య 'బటర్ ఫ్లై కిస్' అంటూ డిఫరెంట్ ముద్దు కూడా చూపించారు.
'రంగ రంగ వైభవంగా' సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ (Ketika Sharma) కథానాయికగా నటిస్తున్నారు. 'ఏంటే! ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్' అని హీరో అడిగే డైలాగ్‌తో టీజర్ (Ranga Ranga Vaibhavanga Teaser) స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు తెలుసా?' అని హీరోయిన్ అంటుంది. 'అంటే బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు ఉన్నావ్' అని హీరో, ఆ తర్వాత 'నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా?' అని హీరోయిన్... దర్శకుడు ఇద్దరినీ చూపించకుండా కేవలం డైలాగులతో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్, కేతికా శర్మను చూపించారు. ఇద్దరి లుక్స్ బావున్నాయి.... ఇద్దరి మధ్య ముద్దును చిత్రీకరించిన విధానం కూడా! ఆ తర్వాత 'నెక్స్ట్ లెవల్ లో ఉంది' అని హీరో చెప్పే డైలాగ్ టీజర్‌కు కూడా వర్తిస్తుందేమో!?
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా... శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 'ఉప్పెన' సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్.
Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్
Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి